• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హమ్మయ్య.. రోహిత్ శర్మకు ఏం కాలేదు..!

    ఈ నెల 10న ఇంగ్లాండ్‌తో భారత్ సెమీ ఫైనల్ పోరు జరగనున్న నేపథ్యంలో ఓ ఘటన భారత అభిమానులను కలవర పెట్టింది. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మ కుడి చేతికి బంతి తగిలింది. ఈ క్రమంలో నెట్స్‌లోనే రోహిత్ విలవిలలాడాడు. దీంతో అతడి గాయంపై సందేహాలు మొదలయ్యాయి. అదృష్టవశాత్తు రోహిత్ త్వరగానే కోలుకుని తిరిగి నెట్స్‌లోకి వచ్చాడు. అతడు మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో అటు అభిమానులు, ఇటు యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నట్టయింది. BREAKING:Good news … Read more

    ఆస్ట్రేలియాలో విరాట్ బర్త్‌డే

    ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో అదరగొడుతున్న విరాట్ కోహ్లీ శనివారం తన పుట్టినరోజును జరుపుకొన్నాడు. ఆస్ట్రేలియాలో తోటి భారత ప్లేయర్ల మధ్య విరాట్ కేక్ కట్ చేశారు. కోహ్లీతో పాటు కోచ్ పాడీ ఆప్టన్ పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడంతో ఇద్దరూ వేడుకలు చేసుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ కేక్ కట్ [వీడియో](url)ను ట్విటర్‌లో షేర్ చేసింది. కోహ్లీ, ఆప్టన్‌లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ప్లేయర్లు సంతోషంగా మెలుగుతూ వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. Birthday celebrations ON in Australia ? ? … Read more

    విరాట్‌ది ఫేక్‌ ఫీల్డింగ్‌

    భారత్‌, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో కొన్ని చర్చనీయాంశమయ్యాయి. విరాట్‌ కోహ్లీ ఫేక్‌[ ఫీల్డింగ్‌](url) చేశాడంటూ బంగ్లా బ్యాటర్‌ నూరుల్‌ హసన్‌ ఆరోపించాడు. అప్పుడు పెనాల్టీగా ఐదు పరుగులు ఇచ్చి ఉంటే మ్యాచ్‌ పరిస్థితి వేరేలా ఉండేదన్నాడు. వర్షం అంతరాయానికి ముందు లిటన్‌ దాస్‌ డ్రైవ్‌ చేసిన బంతిని అర్షదీప్‌ త్రో చేశాడు. మధ్యలో ఉన్న విరాట్‌ చేతిలో బంతి లేకముందే విసిరినట్లు నటించాడు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమన్నాడు. ఇక లిటన్‌ దాస్‌ క్యాచ్‌, దినేశ్‌ కార్తీక్‌ రనౌట్‌పై కూడా చర్చ జరుగుతోంది. Dear @ICC … Read more

    నువ్వొక యోధుడివి విరాట్: జయవర్ధనే

    టీ20 వరల్డ్‌ కప్‌లో తన పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును కోహ్లీ బ్రేక్ చేయడం పట్ల శ్రీలంక మాజీ స్టార్ క్రికెటర్ జవవర్ధనే స్పందించాడు. కోహ్లిని అభినందిస్తూ ఓ [వీడియో](url) షేర్ చేశాడు. రికార్డులు బద్దలు కావడానికే ఉన్నాయి. ఎవరో ఒకరు నా రికార్డులు బద్దలు కొడుతునే ఉంటారు. అది నువ్వే విరాట్. నువ్వు ఎప్పుడూ క్రికెట్‌లో యోధుడివే. ఫామ్ తాత్కాలికం.. కానీ క్లాస్ శాశ్వతంగా ఉంటుంది. బాగా ఆడావు అని కోహ్లిని అభినందించాడు. View this post on Instagram A … Read more

    అందుకే రవూఫ్‌ను టార్గెట్ చేశా; కోహ్లి

    పాక్ ప్రధాన పేసర్ హారిస్ రవూఫ్‌ను ధీటుగా ఎదుర్కొంటే, జట్టులోని మిగతా బౌలర్లు పానిక్ అవుతారని, అందుకే అతడిని టార్గెట్ చేశానని భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి తెలిపాడు. అందుకే రవూఫ్ వేసిన 19వ ఓవర్లలో రెండు సిక్సర్లు బాదానని చెప్పాడు. కాగా మ్యాచ్ ఆరంభానికి ముందు రవూఫ్ ప్రగల్భాలు పలికాడు. మెల్‌బోర్న్ తన అడ్డా అని, ఇక్కడే బిగ్ బాష్ లీగ్ ఆడానని, భారత్‌పై బౌలింగ్ ఎలా చేయాలో తనకు బాగా తెలుసని హెచ్చరించాడు. రెండు సిక్సర్లతో ఊచకోత కోసి రవూఫ్ … Read more

    అశ్విన్‌ని పొగిడిన విరాట్

    పాకిస్థాన్‌పై విజయంలో విరాట్ పాత్ర చాలా కీలకం. కానీ, ఒక బంతిలో రెండు పరుగులు చేయాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్‌ని కూడా తక్కువ చేయలేం. ఈ విషయాన్ని విరాట్ కూడా ధ్రువీకరించాడు. ‘కవర్స్‌ వైపు ఆడాలని అశ్విన్‌కు సూచించా. కానీ, అశ్విన్ మరింత తెలివిగా ఆలోచించాడు. వైడ్ వెళ్తుందని గమనించి వికెట్ లోపలికి జరిగాడు. ఈ ఒక్క చేష్టతో మేం గెలిచేశాం అని అనిపించింది. నిజంగా చాలా తెలివైన పని అది’ అని ట్వీట్ చేశాడు. కాగా, చివరి బంతికి అశ్విన్ ఒక … Read more

    ఇదండీ రోహిత్, కోహ్లీల అనుబంధం!

    పాకిస్థాన్‌తో ఉత్కంఠ పోరులో గెలిచిన అనంతరం ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. విజయానందంతో కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్‌ని ఎత్తుకుని గింగిరాలు తిరిగాడు. దీనికి ప్రతిస్పందిస్తూ కోహ్లీ తన బ్యాటుతో రోహిత్ పిరుదులపై సరాదాగా బాదాడు. ఈ వీడియో ఇద్దరి క్రికెటర్ల ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. ఇటీవల కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్ మధ్య గొడవలో ఒకరు మృతిచెందిన ఘటనను గుర్తు చేస్తూ..‘ఇదీ వీరిద్దరి మధ్యనున్న అనుబంధం. అభిమానులే విర్రవీగిపోతున్నారు. ఇలా కలిసి ఉండండి’ అంటూ వీడియోను ట్యాగ్ చేస్తున్నారు. https://twitter.com/RayeesIsHere/status/1584154183992627201?s=20&t=ctOVqX_XJlIUcx_ZUD3uLQ

    మ్యాచ్‌కే హైలైట్ ఈ క్యాచ్

    ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగులో చెలరేగి, బౌలింగులోనూ ఆకట్టుకుంది. అయితే, ఈ మ్యాచులో గ్లెన్ ఫిలిఫ్స్ పట్టిన క్యాచ్ హైలెట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా స్కోరు 50-3 వద్ద ఉన్నప్పుడు శాంట్నర్ బౌలింగులో స్టాయినిస్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా బంతిని గాల్లోకి లేపాడు. దీంతో పాయింట్ వైపు నుంచి దూసుకొస్తూ డైవ్ చేసి మరీ గ్లెన్ ఫిలిప్స్ బంతిని అందుకున్నాడు. ‘వావ్.. వాట్ ఎ క్యాచ్’ అంటూ క్రికెట్ అభిమానులు ప్రశసంలతో ముంచెత్తుతున్నారు. వీడియో కోసం ట్విటర్ గుర్తుపై క్లిక్ చేయండి. … Read more

    ఫ్యాన్స్‌కు కోహ్లీ స్వీట్ వార్నింగ్

    టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అభిమానులకు [వార్నింగ్](url) ఇచ్చాడు. ఎల్లుండి పాక్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుండగా ఫ్యాన్స్ అక్కడికి వచ్చారు. కోహ్లీ, కోహ్లీ అంటూ గట్టిగా అరిచారు. దీంతో నెట్స్‌ నుంచి బయటకు వచ్చిన కోహ్లీ.. ‘అరే యార్.. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాట్లాడకండి. డిస్ట్రబ్ అవుతాను’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో కోహ్లీని అర్థం చేసుకున్న ఫ్యాన్స్.. మీరు రిలాక్స్‌గా ఉన్నప్పుడే మాట్లాడుతాం భాయ్’ అంటూ వెనుదిరిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా … Read more

    సర్జరీ నుంచి కోలుకున్న రవీంద్ర జడేజ

    టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సర్జరీ అనంతరం పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తోంది. గాయం కారణంగా టీ20WC నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈమేరకు తన జిమ్‌లో వ్యాయామం చేస్తున్న [వీడియోను](url) జడ్డూ తాజాగా షేర్ చేశాడు. వీడియోలో జడేజా పరుగెత్తుతూ కనిపించాడు. ఫిట్‌నెస్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. జడ్డూ ఫిట్‌నెస్ సాధించినా టీ20WCకి అందుబాటులో ఉండకపోవచ్చు. అతని స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. ఇటీవల జరిగిన ఆసీస్, సౌతాఫ్రికా సిరీస్‌ల్లో అక్షర్ రాణించాడు. ??‍♂️??‍♂️??‍♂️ pic.twitter.com/GhHGW5xaV4 — Ravindrasinh jadeja (@imjadeja) October … Read more