• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hyderabad Rains: కశ్మీరులా మారిన హైదరాబాద్ శివారు.. వీడియోలు నెట్టింట్లో హల్‌చల్

    తెలుగురాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి వడగళ్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఆర్టీసీ ఎక్స్‌రోడ్స్‌, మాసబ్‌ట్యాంక్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, నిజాంపేట, ఎస్‌ఆర్ నగర్, ఎల్బీనగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.  హైదరాబాద్‌లో తెల్లవారుజామున వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. పెద్దఎత్తున నష్టం కలిగించింది. మంచు గడ్డల రూపంలో పెద్దఎత్తున రాళ్ల వర్షం కురిసింది. ప్రజలు బయటకు రావాలంటే వణికిపోయారు. వడగండ్లకు భారీ వరదలు తోడవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  … Read more

    కవిత, ED రోజంతా నాటకీయ పరిణామాలు-మళ్లీ నోటీసులు

    దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దర్యాప్తు వేగవంతం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌… విచారణకు హాజురు కాలేనన్న కవిత విజ్ఞప్తిని అంగీకరించి మరో తేదీని ఖరారు చేసింది. ఈ నెల 20న వ్యక్తిగతంగా విచారణకు రావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు, ఇప్పటివరకు ఆమెను సాక్షిగా పరిగణించిన ఈడీ… ఇప్పుడు అనుమానితురాలిగా పేర్కొంది. దీంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. విచారణకు డుమ్మా ఉదయం నుంచి ఈ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 11 గంటలకు విచారణ … Read more

    కరీంనగర్‌: రాష్ట్ర మంత్రి వర్సెస్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు…. గెలిచి నిలిచేదెవరో?

    ఉత్తర తెలంగాణలో కీలకమైన జిల్లా కరీంనగర్. వచ్చే ఎన్నికల వేళ ఇక్కడ ఉన్నంత హడావుడి మరెక్కడా ఉండదని చెప్పాలి. ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో పోరు రసవత్తరం కానుంది. ఎందుకంటే భారాసకు మంచి పట్టు ఉండటంతో పాటు భాజపాకు బలం పెరగటమే కారణం. హ్యాట్రిక్‌ కొట్టి 15 ఏళ్లుగా జిల్లాను ఒంటి చేత్తో ఏలుతున్న గంగుల కమలాకర్‌… మెుదటిసారి ఎంపీగా గెలిచి ఏకంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడి మధ్య మళ్లీ పోరు జరిగే అవకాశం ఉంది. నియోజకవర్గం ఓటర్లు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మెుత్తంగా 16 … Read more

    SPACE TOURISM: అంతరిక్ష ప్రయాణం… రూ. 6 కోట్లు మాత్రమే

    అంతరిక్ష ప్రయాణాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే ధరలోతో తీసుకువచ్చేందుకు ఇస్రో అడుగులు వేస్తోంది. ఈ దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు.  2030 నాటికి రూ. 6 కోట్లతో అంతరిక్షానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌ ఛైర్మన్‌ సోమనాథ్ వెల్లడించారు. ప్రభుత్వం తరఫున అంతరిక్ష ప్రయాణం ఏర్పాటు చేసే దిశగా చర్యలు వేగవంతమయ్యాయి. ప్రపంచ మార్కెట్‌లో ఉన్న ధరలతో పోలీస్తే అతి తక్కువగా ఉండేలా చూసుకుంటున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.  “ భారతదేశానికి సంబంధించిన స్పేస్‌ టూరిజం మాడ్యూల్ పనులు శరవేగంగా … Read more

    KAVYA KALYAN RAM: నటన సరే.. మరి అక్కడ రాణిస్తుందా?

    ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసిన ఓ హీరోయిన్‌ గురించే చర్చ. ఆమె ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చింది? అంటూ ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరో కాదు కావ్య కల్యాణ్ రామ్. బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కావ్య…మసూద, బలగం సినిమాలతో హీరోయిన్‌గా మారి గుర్తింపు తెచ్చుకుంది.  అచ్చమైన తెలుగమ్మాయి హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ తెలుగమ్మాయి నాగార్జున హీరోగా వచ్చిన స్నేహమంటే ఇదేరా చిత్రంతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. గంగోత్రి, ఠాగూర్‌, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్‌, … Read more

    #AskNani: ఫ్యాన్‌కు నాని  స్ట్రాంగ్ కౌంటర్… మళ్లీ చెబుతున్నా  KGF, దసరా ఒకటి కాదు.. ఒరిజినల్ పీస్

    దసరా చిత్రంతో అభిమానులకు మాస్‌ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు నాని. మార్చి 30న మెుదలవుతున్న మాస్‌ జాతర కోసం సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావటంతో సినిమాపై సూపర్‌ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రచారంలో బిజీగా ఉన్న నేచురల్ స్టార్… ట్విటర్‌లో  అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఓసారి వాటిపై లుక్కేయండి. దసరా రన్‌టైమ్‌ #Asknaniలో భాగంగా దసరా చిత్రం రన్‌ టైమ్ రివీల్‌ చేశాడు నాని. ఈ చిత్రంలో బాగా హై ఇచ్చే సీన్ ఏదంటూ … Read more

    రూ.3000ల పింఛన్..నా ఎకానమిక్స్ ..నా పాలిటిక్స్‌.. జగన్ స్పీచ్‌ హైలైట్స్‌

    ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే జనవరి నాటికి పింఛను రూ. 3000 చేశాకే ఎన్నికలకు వెళతామని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కులం, వర్గం, మతం అనేది చూడకుండా సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి చేరుస్తామని వెల్లడించారు. ఎన్నికల వరకే రాజకీయాలు, అయిపోయాక అందరూ నావాళ్లే అనడానికి ఈ నాలుగేళ్ల పాలన నిదర్శనమన్న సీఎం… గాల్లో మాటలు… గ్రాఫిక్స్‌ మాయాజాలం చూపించబోను ఇదే నా ఎకనామిక్స్, పాలిటిక్స్‌ అంటూ రెండో రోజు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తనదైన స్టైల్‌లో స్పీచ్ ఇచ్చారు.  రూ.3000 పింఛన్ … Read more

    దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్‌ మీద వాహనం నిలుపుతున్నారా?…. తస్మాత్‌ జాగ్రత్త !

    ఎండాకాలం వేళ.. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుంటే…హైదరాబాద్‌ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌ మీదుగా వెళ్తున్నప్పుడు… స్వచ్ఛమైన గాలి తగిలేసరికి…  బండి అలా ఒక్కసారి పక్కన ఆపి… ఒకే ఒక్క సెల్ఫీ దిగితే ఏది ఏమైనా ఆ కిక్కే వేరు కదా..!  కానీ, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారంటే మీ జేబులు ఖాళీ అవుతాయి. ఎందుకంటే ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. ముక్కుపిండి రూ. 2 వేలు వసూలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.  కేబుల్ బ్రిడ్జ్‌ ఐకానిక్‌గా నిలవటంతో పాటు చుట్టు … Read more

    IPL 2023: సీజన్ ప్రారంభానికి ముందే కీలక ఆటగాళ్లు దూరం…అవకాశం దక్కేది ఎవరికో?

    ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)కి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. మార్చి 31 నుంచి 16వ సీజన్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్‌లో భాగంగా కీలకమైన ఆటగాళ్లు గాయాల బారిన పడి దూరం కావటం ఫ్రాంఛైజీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతమున్న జట్లలో కొంతమంది ప్లేయర్లు దూరమవుతుండగా.. మరికొందరు ఆడటంపై అనుమానాలు ఉన్నాయి. ఆ సంగతులేంటో తెలుసుకోండి.  ముంబయికి ఎదురుదెబ్బ గతేడాది ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన చేసిన ముంబయికి ఈ సారి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. … Read more

    RRR సినిమాకు ఆస్కార్‌ రావడంపై బాలీవుడ్ అక్కసు… మేకప్ ఆర్టిస్ట్ వ్యాఖ్యలు దుమారం

    భారతీయ చిత్రాలు RRR, ది ఎలిఫెంట్ విస్పరర్ సినిమాలకు రెండు ఆస్కార్‌ అవార్డులు వచ్చాయి. దేశం మెుత్తం గర్వించింది. ఇలాంటి సమయంలో ఆస్కార్‌ను కూడా కొన్నారంటూ ఓ మేకప్ ఆర్టిస్ట్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మేకప్ చేసే షాన్ ముట్టాత్తిల్‌ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో నెటిజన్లు అతడిపై విరుచుకుపడుతున్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాటకు ఆస్కార్‌ ఇవ్వటం పట్ల అక్కసు వెళ్లగక్కడా షాన్.  నాటునాటుకు ఆస్కార్ ఇవ్వటం చాలా … Read more