Manchu Manoj: మంచు మనోజ్‌కు షాకిచ్చిన కన్నతల్లి.. విష్ణుకు సపోర్ట్‌గా స్టేట్‌మెంట్
మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రాచకొండ సీపీ వార్నింగ్‌తో కాస్త సద్దుమణిగిన ఈ వివాదం శనివారం (డిసెంబర్ 14) మరోమారు రాజుకుంది. పోలీసులు హెచ్చరించినా విష్ణు తనను తన కుటుంబాన్ని వేదిస్తున్నాడని మనోజ్ ఆరోపించాడు. ఇంట్లో వేడుకలు జరుపుకుంటున్న క్రమంలో ఇన్‌వర్టర్‌లో షుగర్ వేసి పవర్ కట్స్‌కు కారణమయ్యాడని ప్రెస్‌నోట్ విడుదల చేశాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీనిపై మోహన్‌బాబు రెండో భార్య, మనోజ్ కన్నతల్లి నిర్మల తాజాగా స్పందించారు. … Read more