• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల ఘనత.. తొలిసారిగా బేరియాట్రిక్ సర్జరీ.. 2 నెలల్లో 70 కిలోలు తగ్గిన పేషంట్

    హైదరాబాద్‌కి చెందిన 23ఏళ్ల యువకుడు రెండు నెలల్లోనే దాదాపు 70 కేజీల బరువు తగ్గాడు. అయితే, అది డైట్ వల్లనో, వ్యాయామం చేయడం వల్లనో తగ్గింది కాదు. బేరియాట్రిక్ సర్జరీ వల్ల సాధ్యమైంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఇది సత్ఫలితాలను ఇస్తోంది. మరి, ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి? ఎవరు చేయించుకోవాలి? శస్త్రచికిత్సను ఎలా చేస్తారు? లైపోసెక్షన్‌కి ఈ సర్జరీకి ఏమైనా తేడా ఉందా? అనే విషయాలను తెలుసుకుందాం. 

    బేరియాట్రిక్ సర్జరీ అంటే?

    అతి ఊబకాయంతో బాధపడుతున్న వారికి తప్పనిసరి పరిస్థితుల్లో చేసే సర్జరీ ఇది. దీనిని వెయిట్ లాస్ సర్జరీ అని కూడా పిలుస్తారు. రెగ్యులర్ డైట్, వ్యాయామం ద్వారా శరీరం నియంత్రణలోకి రాని నేపథ్యంలో ఈ సర్జరీకి వైద్యులు మొగ్గు చూపుతారు. అయితే, ఇది ఎంతో సంక్లిష్టమైంది. విజయవంతం అయ్యే సంభావ్యత కూడా తక్కువే. 

    బేరియాట్రిక్ సర్జరీని ప్రధానంగా రెండు రకాలుగా చేస్తారు. కడుపు పరిమాణాన్ని తగ్గించడం, జీర్ణవ్యవస్థను పునర్ వ్యవస్థీకరించడం. మొదటి విధానంలో జీర్ణాశయం పరిమాణాన్ని తగ్గిస్తారు. పేషెంట్ ఆరోగ్య స్థితిని అంచనా వేశాక ఎంత మేరకు సైజుని తగ్గించాలని వైద్యులు నిర్ణయిస్తారు. ఫలితంగా కొంచెం ఆహారం తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. రెండో విధానంలో చిన్న పేగుకు బైపాస్ సర్జరీ చేస్తారు. చిన్న పేగు భాగాలను పునర్ వ్యవస్థీకరిస్తారు. ఫలితంగా ఆహారం నుంచి క్యాలరీలను, పోషకాలను శోషణం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. 

    ఎవరికి చేయాల్సి ఉంటుంది?

    అతి ఊబకాయంతో బాధపడుతున్న వారికి ‘బేరియాట్రిక్ సర్జరీ’ చేయాల్సి ఉంటుంది. బాడీమాస్ ఇండెక్స్(BMI) 40 కన్నా ఎక్కువ ఉన్న వారు బేరియాట్రిక్ సర్జరీని చేయించుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 35 నుంచి 40 మధ్యలో ఉండి జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా  ‘బేరియాట్రిక్ సర్జరీ’ ద్వారా బరువు తగ్గొచ్చు. అయితే, బరువు తగ్గడానికి సర్జరీ చేస్తే సరిపోదు. శస్త్రచికిత్స అనంతరం నియామనుసారంగా డైట్, వ్యాయామం, మెడికల్ కోర్సులను పాటించాల్సి ఉంటుంది. అప్పుడే సర్జరీ ఫలితం కనిపిస్తుంది. 

    రిస్క్..

    సాధారణంగా ఏ సర్జరీలోనైనా రిస్క్ ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీ కూడా క్లిష్టమైనదే. అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ఈ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. వైద్య నిపుణులతో చర్చించాక, బరువు తగ్గడానికి ఏ మార్గమూ లేకపోతేనే దీనికి మొగ్గు చూపాలి. ఈ సర్జరీ వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండొచ్చు. 

    లైపోసెక్షన్ అంటే?

     లైపోసెక్షన్ అనేది ఒక కాస్మొటిక్ సర్జరీ. బరువు తగ్గడానికి చేసేది కాదు. శరీరంలోని వివిధ చోట్ల పేరుకుపోయిన అనవసర కొవ్వును తొలగించడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు. వ్యాయామం, ఇతర ఆహార నియమాల వల్ల సంబంధిత చోట్ల కొవ్వు కరగకపోతే లైపోసెక్షన్‌కి సిఫార్సు చేస్తారు. 

    అరుదైన ఘనత..

    హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి ఈ అరుదైన ఘనత సాధించింది. వందేళ్ల చరిత్రలో తొలిసారిగా బేరియాట్రిక్ సర్జరీని చేపట్టి విజయవంతం చేసినట్లు వైద్యులు వెల్లడించారు. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌కు చెందిన 23ఏళ్ల ఠాకూర్ మణింద్ర సింగ్ ఈ సర్జరీని చేయించుకున్నాడు. 240 కిలోల బరువు నుంచి సర్జరీ అనంతరం రెండు నెలల్లోనే 170 కేజీలకు తగ్గాడు. మరో ఆరు నెలల్లో 70-80 కిలోల బరువు తగ్గుతాడని ఉస్మానియా ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. 

    ఇక నో టెన్షన్.. 

    ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సర్జరీ చేయడానికి కనీసం రూ.8 నుంచి రూ.10లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఉస్మానియా ఆసుపత్రిలో చేయడం ద్వారా ఈ భారం తగ్గినట్లేనని మణింద్ర సింగ్ తండ్రి సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో అతి ఊబకాయంతో బాధపడుతున్న వారికి ఇదొక సదవకాశం. ఎలాంటి ఖర్చు లేకుండానే సర్జరీ చేయించుకుని బరువు తగ్గొచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv