దీప్తి అసలు పేరేంటి?
దీప్తి సునయన ఇన్ స్టా ఐడీని చూసిన అందరికీ దీప్తి అసలు పేరేంటి అనే ప్రశ్న ఎదురవుతుంది. ఎందుకంటే దీప్తి ఇన్ స్టా ఐడీలో దీప్తి రెడ్డి అని ఉంటుంది. దీప్తి సునయన అసలు పేరు దీప్తి రెడ్డి. తను తెలుగు నాటే జన్మించింది.
షణ్ముక్‌తో బ్రేకప్ స్టోరీ..
- దీప్తి సునయన అనగానే ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ షణ్ముక్ జశ్వంతే గుర్తొస్తాడు. వీరిద్దరూ ప్రేమ పక్షులు. చాలా రోజులు ప్రేమించుకున్న తర్వాత రీసెంట్‌గా ఏమయిందో ఏమో కానీ విడిపోయారు. వీరు విడిపోయారన్న వార్త తెలిసి చాలా మంది అయ్యో అని బాధపడ్డారు. దీప్తి కూడా బిగ్ బాస్ 2 సీజన్‌కు వెళ్లొచ్చింది.
షణ్ముక్ బిహేవియరే కారణమా..
దీప్తి సునయన షణ్ముక్‌తో విడిపోవడానికి అతడి బిహేవియరే కారణమని చాలా మంది చెబుతున్నారు. బిగ్ హౌజ్‌లో ఉండగా.. అతడు మరో కంటెస్టెంట్‌తో చాలా క్లోజ్‌గా ఉన్నాడని అంటున్నారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఇవన్నీ కామనే అని అనే వారు కూడా చాలా మందే ఉన్నారు. కావున వారు ఏ కారణంతో విడిపోయారో వారే క్లారిటీ ఇస్తే గానీ తెలియదు.
అందాల బొమ్మలా తయారయ్యి…
బాపూ బొమ్మలా తయారయి దీప్తి చేసిన వీడియోను కొన్ని గంటల్లోనే అనేక మంది వీక్షించారు. ఈ వీడియోకు లైక్స్ కూడా లక్షల్లోనే వచ్చాయి. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్