దేశంలో ప్రతీ పండగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా దీపావళి అంటే ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకునే వేడుక. అయితే ఈసారి వచ్చే దీపావళిని మీ జీవిత భాగస్వామికి గుర్తుండిపోయేలా చేయండి. అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి వారిని సర్‌ప్రైజ్ చేయండి. అయితే ఏ గిఫ్ట్ కొనాలని ఆలోచిస్తున్నారా?. మీకోసం YouSay విభిన్నమైన గిఫ్ట్ ఐడియాలను తీసుకొచ్చింది. ఇందులో మీ అర్ధాంగికి ఏది అవసరమో దానిని బహుమతిగా ఇచ్చి ఆమె ఆనందాన్ని రెట్టింపు చేయండి. ఆ బహుమతులు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
బ్యూటీ ప్రొడక్ట్స్
మీ భార్య అందాన్ని రెట్టింపు చేసే బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేయవచ్చు. ఇది ఆమెకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ప్రస్తుతం చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్‌లో లభిస్తున్నాయి. వీటిలో Spawake Skin Care ప్రొడక్ట్స్‌కు వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ ఉంది. కాబట్టి దీన్ని మీరు గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటుంది.
పసందైన స్వీట్లు
పండుగ అంటేనే డైటింగ్‌లు, ఆహారనియమాలు వదిలేసి కడుపునిండా ఇష్టమైన ఆహారాన్ని ఆరగించే రోజు. కాబట్టి మీ భార్యకు ఎంతో ఇష్టమైన స్వీట్స్‌ను ఆమెకు బహుమతిగా ఇవ్వండి. చాక్లెట్స్ నుంచి మొదలు పెట్టి డ్రై ఫ్రూట్స్ లడ్డూ వరకు ఏదైనా సరే ఆమెకు ఇష్టమైనదాన్ని బహుమతిగా ఇవ్వవచ్చు.
మెుబైల్ ఫోన్
ఈ దీపావళి మీ భార్యకు గుర్తుండిపోయేలా ఉండాలంటే ఆమెకు ఓ మెుబైల్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. ఆ ఫోన్‌ను చూసిన ప్రతిసారి ఆమెకు మీరే గుర్తుకు వస్తారు. ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. ఫోన్ కొనుగోలుకు ఇదే మంచి అవకాశం. మీ బడ్జెట్ రూ.8000 లోపు అయితే Samsung Galaxy M04 మెుబైల్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు.
స్మార్ట్ వాచ్
మీ భార్య ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇచ్చే స్మార్ట్‌వాచ్‌ను కూడా ఆమెకు బహుమతిగా ఇస్తే బాగుంటుంది. మార్కెట్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా చాాలా స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో వచ్చాయి. వాటిలో Vibez by Lifelong Ruby వాచ్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులో Female Cycle Tracker కూడా ఉంది.
వాషింగ్ మిషన్
ఒకవేళ మీ భార్య ఇంట్లోని బట్టలు ఉతకలేక ఇబ్బంది పడుతుంటే ఒక వాషింగ్ మిషన్‌ను ఆమెకు గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. ఈ బహుమతి ఆమెకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ దీపావళి నుంచి తన శ్రమకు బ్రేక్ పడినట్లు ఆమె ఫీలవుతుంది. మీ బడ్జెట్ రూ.15,000 అయితే Samsung 7 kg వాషింగ్ మిషన్ ట్రై చేయవచ్చు.
ఇయర్ బడ్స్
కిచెన్‌లో తీరికలేని పనులతో గడిపే భాగస్వాములకు ఇయర్‌బడ్స్ గిఫ్ట్‌గా ఇస్తే వారు ఎంతో సంతోషిస్తారు. ఇయర్‌బడ్స్ ద్వారా పాటల వింటూ వారు సరదాగా తమ పనులను చేసుకునేందుకు వీలు ఏర్పడుతుంది. మీ బడ్జెట్ రూ.1000 అయితే boAt Airdopes 121 PRO పరిశీలించవచ్చు.
మైక్రోవేవ్ ఓవెన్
చల్లారిన పదార్థాలను వేడి చేయడానికి మైక్రో వేవ్ ఓవెన్ ఉపయోగ పడుతుంది. దీనిని గిఫ్ట్‌గా ఇవ్వడం వల్ల మీ భాగస్వామికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేగాక ఇంటిల్లపాదికి ఇది ఉపయోపగపడుతుంది. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో మైక్రోవేవ్ ఓవెన్స్‌పై ఆఫర్లు ఉన్నాయి. వాటిలో Panasonic 20L Solo Microwaveకు మంచి ఫీడ్ బ్యాక్ ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!