భారీ సెట్‌లు వేసినా.. బాహుబలిల ఫైట్‌లు చేసినా.. చాంతాడంత డైలాగులు చెప్పినా చాలా సినిమాలు అట్టర్ ఫ్లాప్‌గానే మిగిలిపోతాయి. కాని కొన్ని చిన్న సినిమాలు మాత్రం అంతగా పరిచయంలేని నటీనటులతో రూపుదిద్దుకొని అభిమానుల మనసులు దోచుకుంటున్నాయి. అలాంటి కోవకే చెందుతుంది డీజే టిల్లు మూవీ. నూతన నటీనటులు, ఆకట్టుకునే డైలాగులు, వాస్తవానికి దగ్గర తీసిన కథ, కామెడీ, పాటలు ఇలా ఈ సినిమా హిట్ కొట్టడానికి ఎన్ని అంశాలైనా ఉండొచ్చు.. కాని ప్రమోషన్లపరంగా ఈ సినిమా నుంచి చిన్న చిన్న సినిమాలు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవేంటో మీరూ చూసేయండి.
- ప్రమోషన్స్
పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా ప్రేక్షకులకు తెలియాలంటే ప్రధానంగా ప్రమోషన్లు అవసరం. ఇంటర్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, కాంట్రవర్సీలు, రూమర్లు, సోషల్ మీడియాలు ఇలా ఏ మార్గం ద్వారా అయినా సరే సినిమాను ప్రేక్షకులకు తెలియజేయాలి. అప్పుడే అభిమానులు మూవీ చూడటానికి ఆసక్తి చూపిస్తారు. డీజే టిల్లు సినిమా సక్సెస్ సాధించడానికి మెయిన్ రీజన్ ప్రమోషన్స్ ఏ అని చెప్పొచ్చు.
- నెగిటివ్ డైలాగ్స్.. పాజిటివ్ రెస్పాన్స్
ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందని తొలుత ప్రచారం చేశారు. అందుకు అనుగుణంగానే టీజర్, ట్రైలర్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాని వాస్తవానికి ఈ సినిమా కుటుంబ కథాచిత్రంగా ఉంటుందని ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మూవీ అందరికీ తెలియాలని నెగిటివ్ డైలాగులు చెప్పినప్పటికీ అసలు కథ వేరే ఉండటం విశేషం. ఇలానే చిన్న చిన్న సినిమా నిర్మాతలు కూడ పకడ్బందీగా ప్రమోషన్స్ చేసుకుంటే కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
- పెద్ద హీరోతో పోలిక
ఈ సినిమాలో హీరోగా నటించిన సిద్దూ జొన్నలగడ్డను తొలుత విజయ్ దేవరకొండతో పోల్చారు. ఈ పోలిక మూవీకి మంచి ప్లస్ అయ్యింది. అప్పటి వరకు ఎవరికీ పరిచయం లేని ఓ నటుడిని పెద్ద హీరోతో పోల్చడంతో అందరిలో ఆసక్తి పెరిగింది. అతడి నటన చూడటానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఓ చిన్న మూవీ హీరో ఫేం ఉన్న నటుడి పేరుతో కంపేర్ చేసుకొని ఒక్క సినిమాతోనే అభిమానులను సంపాదించుకున్నాడు.
- ఇంటర్వ్యూలు, ఇతర అంశాలు
మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరో సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ ఎక్కడ కాంట్రవర్సీల జోలికి వెళ్లలేదు. హుందాగా వ్యవహరిస్తూ అసలు సినిమా ఎందుకు చూడాలో వివరించారు. కొందరు కాంట్రవర్సీల ద్వారా ఫేం అవ్వొచ్చని భావించినప్పటికీ అన్ని సందర్భాల్లో అది వర్కవుట్ అవ్వదు. అలాగే సినిమాకి ఎన్ని ప్రమోషన్లు బాగున్నా కథ బలంగా లేకుంటే కష్టమవుతుంది. ఈ సినిమాను డైరెక్టర్ చాలా చక్కగా తెరకెక్కించాడు. కామెడీ టైమింగ్, హీరో డైలాగులు, పాటలు, సినిమాటోగ్రఫీ మూవీకి సక్సెస్ తీసుకొచ్చేలా చేశాయి. ఇలా ప్రతి అంశాన్ని పరిశీలించి చిన్న సినిమాలు కూడ ముందడుగు వేస్తే విజయం కచ్చితంగా వరిస్తుంది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!