HYD: రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్ రాకెట్ గుట్టురట్టయింది. విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో 5 కిలోల కొకైన్ లభ్యమైంది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.50 కోట్లు. ఓ సూట్‌కేస్‌తోపాటు మహిళలు వినియోగించే నాలుగు హ్యాండ్‌బ్యాగ్‌ల అడుగు భాగంలో ఈ సరకును పొడిరూపంలో దాచారు. లావోస్ నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడు డ్రగ్స్ తీసుకొచ్చాడు. హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం తిరిగి దిల్లీకి వెళ్లే ప్రయత్నంలో ఉన్న నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/09/03072933/image-112.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్!