నిన్న బిగ్‌బాస్5 గ్రాండ్ ఫినాలే జరిగింది. చాలా మంది తారలు, ప్రముఖ సెలబ్రిటీస్ వచ్చి అలరించారు. ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్, రాజమౌళి, జగపతిబాబు, నాని, సాయిపల్లవి, కృతి శెట్టి, రష్మిక, సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్, నాగచైతన్య ఇలా వరుసపెట్టి సెలబ్రిటీస్‌ను ఫినాలేకి తీసుకొచ్చాడు నాగార్జున. టాప్ 5 నుంచి సిరి, మానస్, శ్రీరామ్ వెళ్లిపోయిన తర్వాత హౌజ్‌లో సన్నీ, షన్ను ఇద్దరు మాత్రమే మిగిలారు.
అప్పుడు మన హైద్రాబాదీ అమ్మాయి, తెలుగమ్మాయి వచ్చి వాళ్లలో ఒకరిని స్టేజ్‌పైకి తీసుకొస్తుందని చెప్పి ఫరియా అబ్దుల్లాను ఆహ్మానించాడు నాగ్. హౌజ్‌లో ఇద్దరు చాలా టెన్షన్‌లో ఉన్నారు. వాళ్ల టెన్షన్ తగ్గించి, కాసేపు సరదాగా వారితో డ్యాన్స్ చేయించి ఎలిమినేట్ అయిన ఒకరిని బయటకు తీసుకురమ్మని చెప్పాడు నాగ్. ఇంట్లోకి చిట్టి వస్తుందని వారిద్దరికీ చెప్పాడు.
ఇద్దరూ చాలా ఎగ్జైటింగ్‌గా చిట్టి అని పిలిచారు. ఇప్పుడు చిట్టి కాదు నా ఫ్రెండ్స్ అందరూ నన్ను బంగార్రాణి అని పిలుస్తున్నారు అని చెప్పింది ఫరియా. దీంతో సర్ మీ బంగార్రాణితో డ్యాన్స్ చేసేందుకు పర్మిషన్ ఉందా అని అడిగాడు సన్నీ. తను అక్కడికి వచ్చిందే మీతో డ్యాన్స్ చేయడానికి అని చెప్పాడు నాగ్.
బంగార్రాజు నుంచి నిన్న రిలీజైన పార్టీ సాంగ్ ‘వాసివాడి తస్సాదియ్యా’కు స్టెప్పులేసి చూపించింది. కాసేపు టెన్షన్ పక్కన పెట్టి ఆమెను చూస్తూ ఇద్దరు డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత విన్నర్‌ను ప్రకటించాల్సిన సమయం వచ్చింది అని చెప్పిన నాగ్..ఇద్దరినీ తమ పేర్లతో ఉన్న బాక్సులను స్టోర్ రూమ్ నుంచి తెచ్చుకోమని చెప్పాడు. ఇద్దరు వెళ్లి బాక్స్‌లు తెచ్చుకున్నారు. అందులో చేయి పెట్టి కలపాలి. ఎవరికి రెడ్ కలర్ వస్తే వారు ఎలిమినేట్. గ్రీన్ వచ్చినవాళ్లు విన్నర్ అని చెప్పాడు. అక్కడ ఉన్న హార్ట్ సింబల్ ఎలిమనేట్ అయిన వాళ్లకు ఇచ్చి వారిని బయటకు తీసుకురావాలని ఫరియాకు చెప్పాడు.
సన్నీ, షన్ను బాగా టెన్షన్ పెడుతూ బాక్స్‌లో చేయి పెట్టి బయటకు తీయగా ఇద్దరి చేతులకు బ్లూ కలర్ ఉంది. దీంతో ఫరియాతో పాటు సన్నీ, షణ్ముఖ్‌కి కూడా ఏం అర్థం కాలేదు. సర్ ఏంటి సార్ ఇది అని అడిగింది. దీంతో బిగ్‌బాస్ మీతో ఇంకోసారి ఆడుకున్నాడు అని చెప్పిన నాగ్ విన్నర్‌ని స్టేజ్‌పైనే ప్రకటిస్తాం. నేను హౌజ్‌లోకి వస్తున్నాను. ఫరియా హార్ట్ నీ దగ్గరే పెట్టుకో. ఇక బయటకు రావొచ్చు అని చెప్పాడు. ఇద్దరికి గుడ్‌లక్ అని చెప్పిన ఫరియా.. హౌజ్‌నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత నాగ్ వెళ్లి ఇద్దరినీ స్టేజ్‌పైకి తీసుకురావడం, సన్నీని విన్నర్‌గా ప్రకటించడం జరిగాయి.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి