బిజినెస్ లో అగ్రిమెంట్ ఉంటుంది కానీ.. పెళ్లిళ్లలో అగ్రిమెంట్ ఉంటుందని మీకు తెలుసా.. ఇలాంటి పెళ్లిళ్లు సినిమాల్లో చూసి ఉంటాం కానీ.. రియల్ లైఫ్ లో మాత్రం అరుదు. అయితే, నిజ జీవితంలో జరిగిన ఓ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుడు-వధువు మధ్య జరిగిన ఈ అగ్రిమెంట్ లో వధువు(హర్షు సంగ్తానీ) కాబోయే భర్త(కరణ్) కు 5 షరతలు విధించింది. అంతేకాకుండా భర్త నుంచి బాండ్ పేపర్ కూడా రాయించుకుంది. ఇంతకీ ఆ షరతులేంటంటే.. ప్రతీ రోజూ రాత్రి భర్త తన దగ్గరే ఉండాలి, తనతో కలిసి వెబ్ సిరీస్ చూడాలి, రోజుకు 3సార్లు ఐలవ్ యూ చెప్పాలి, బార్బెక్యూ ఫుడ్ ని తనతో కలిసి షేర్ చేసుకోవాలి, ఇక చివరగా ఏం అడిగినా నిజమే చెప్పాలి అంటూ కండిషన్స్ పెట్టింది. ఈ షరతులకు సంబంధించిన బాండ్ పేపర్ పై భర్త సంతకం తీసుకుని లామినేషన్ కూడా చేయించి దాచిపెట్టింది. హర్షు మేకప్ ఆర్టిస్ట్ భూమికా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఆ పోస్ట్ ను మీరు కూడా చూసేందుకు Watch on instagram పై క్లిక్ చేయండి.