[VIDEO](url):తమిళనాడులోని అరక్కోణంలో విషాదం జరిగింది. ఓ ఆలయ ఉత్సవాల్లో క్రేన్ కూలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాణిపేట జిల్లా నెమిలిలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఉత్సవాల్లో భాగంగా 25 అడుగుల ఎత్తైన క్రేన్‌పై అమ్మవార్లను ఊరేగిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు క్రేన్‌పై నిలబడి పూలమాలలు అందిస్తున్నారు. అకస్మాత్తుగా క్రేన్ కూలిపోవడంతో క్రేన్‌పే ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. క్రేన్ కింద పడి మరొకరు చనిపోయారు. భక్తులు ఎక్కడికక్కడ పరుగులు తీయడంతో తొక్కిసలాటలో మరో 9 మంది గాయపడ్డారు.
-
Screengrab Twitter:DeshmukhHarish9
-
Screengrab Twitter:DeshmukhHarish9