‘ఆర్ఆర్‌ఆర్’ (RRR) తర్వాత రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గేమ్ ఛేంజర్’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజైంది. ప్రస్తుతం అది యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
రా మచ్చ మచ్చ సాంగ్ రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) హీరోగా దర్శకుడు శంకర్ (Shankar) తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ‘రా మచ్చ మచ్చ’ (Ra Macha Macha) సోమవారం విడుదలైంది. ఈ పాటను లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ రాశారు. తమన్ సంగీతం అందించారు. సాంగ్‌ను పూర్తిగా ఏపీలోని వైజాగ్ ప్రాంతంలో చిత్రీకరించారు. భారీ సెటప్‌తో ఫుల్ కలర్ఫుల్గా సాంగ్ షూట్ చేశారు. ఇందులో రామ్‌చరణ్ ఎనర్జిటిక్ స్టెప్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ‘వీణ స్టెప్’ను ఈ పాటలో రామ్‌చరణ్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. రిపీట్ మోడ్‌లో సాంగ్ చూస్తూ మైమరిచిపోతున్నారు. ఈ సాంగ్‌పై ఓ లుక్కేయండి.
యూట్యూబ్‌లో ట్రెండింగ్
గేమ్ ఛేంజర్‌లోని ‘రా మచ్చ మచ్చ’ విడుదలైన నిమిషాల వ్యవధిలోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ సాంగ్‌ను పెద్ద ఎత్తున వీక్షిస్తున్నారు. ఫాస్ట్ బీట్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 24 గంటలు పూర్తికాకుండానే ఈ సాంగ్ 15 మిలియన్ల వ్యూస్ సాధించింది. తొలుత 10 మిలియన్ల వ్యూస్ అంటూ నిర్మాణ సంస్థ పోస్టు చేయగా వార్త రాసేలోపు మరో 5 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం. ఇదే ఊపు కొనసాగితే 50 మిలియన్ల వ్యూస్ పక్కా అంటూ మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ డ్యాన్స్‌కు తగ్గ మాస్ సాంగ్ ఇచ్చారంటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ను ప్రశంసిస్తున్నారు.
వీణ స్టెప్ అందుకే దాచారా!
‘రా మచ్చా మచ్చా’ సాంగ్‌లో రామ్‌చరణ్ క్లాసిక్ లుక్స్‌లో కనిపించినా స్టెప్స్ మాత్రం ఊర మాస్‌గా అనిపించాయి. ముఖ్యంగా చిరంజీవి కెరీర్‌లో మరుపురాని మూమెంట్‌గా నిలిచిన ‘వీణ స్టెప్’ను రామ్‌చరణ్ ఈ సాంగ్‌లో వేశారు. ఈ స్టెప్పే పాటలో హైలెట్‌గా నిలవనున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే నేరుగా థియేటర్లలో చూపించే ఉద్దేశ్యంతో చరణ్ వేసిన వీణ స్టెప్‌ను ప్రస్తుతం రివీల్ చేయలేదు. దీంతో చరణ్ ఈ స్టెప్‌ను ఎలా వేశారో అని ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నారు. ఈ సాంగ్ గనుక క్లిక్ అయితే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రిలీజ్ డేట్‌పై సందిగ్దం
గేమ్ ఛేంజర్ చిత్రం రిలీజ్‌పై ఇప్పటివరకూ స్పష్టమైన ప్రకటన రాని నేపథ్యంలో ఈ ఏడాది ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రా మచ్చా మచ్చా సాంగ్ రిలీజ్ సందర్భంగా ఈ మూవీ విడుదలపై నిర్మాత దిల్‌రాజు క్లారిటీ ఇచ్చారు. గేమ్ ఛేంజర్‌ను డిసెంబర్ 25న రిలీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే రిలీజ్ తేదీపై దిల్‌రాజు క్లారిటీ ఇచ్చినప్పటికీ అభిమానుల్లో సందిగ్ధం మాత్రం తొలగలేదు. గతంలో జరిగిన ఓ ఈవెంట్‌లో గేమ్ ఛేంజర్‌ను డిసెంబర్ 20న రిలీజ్ చేస్తామని దిల్‌రాజు ప్రకటించారు. తాజాగా దాన్ని మరో 5 రోజులుగు పొడిగించారు. ఈ లెక్కన ఆ రెండు తేదీల్లో ఏది నమ్మాలి అని ఫ్యాన్స్ తర్జనభర్జన అవుతున్నారు.
చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
రామ్‌చరణ్, తమిళ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రానున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు (Director Buchi Babu) దర్శకత్వంలో రామ్‌చరణ్ (Ram Charan) నటించబోతున్నాడు. ‘RC16’ వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది. ‘పుష్ప 2’ రిలీజ్ అనంతరం రామ్, సుకుమార్ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?