ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యంగ్ హీరో ‘విష్వక్ సేన్’ (Vishwak Sen).. తనకంటూ సెపరేట్ ఫ్యాన్‌బేస్‌ను సృష్టించుకున్నాడు. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రం సైతం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. విష్వక్ కెరీర్‌లో మంచి వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అక్కడ కూడా దూసుకుపోతోంది. ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ అదరగొడుతోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్
విష్వక్ సేన్, నేహా శెట్టి (Neha Shetty) జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం.. మే 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ప్రముఖ నటి అంజలి కీలక పాత్ర పోషించగా.. సాయి కుమార్, గోపరాజు రమణ, అయేషా ఖాన్, హైపర్ ఆది ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇదిలా ఉంటే జూన్ 14న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అత్యధిక వీక్షణలతో ఓటీటీలో ఈ మూవీ దూసుకుపోతోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ 2లో ఈ సినిమా ఉన్నట్లు ఓటీటీ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేసింది.
విష్వక్ నటనపై ప్రశంసలు
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. లంక గ్రామాల బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూప. ఇందులో లంకల రత్నం అనే యువకుడిగా విశ్వక్ సేన్ యాక్టింగ్, అతడి క్యారెక్టరైజేషన్ అభిమానులను ఫిదా చేసింది. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో విశ్వక్ సేన్ అదరగొట్టాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. మరోవైపు హీరోయిన్ నెహా శెట్టితో అతడి కెమెస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలిచాయి.
కథేంటి
కొవ్వూరు గ్రామానికి చెందిన లంకల రత్నం (విశ్వక్ సేన్) రాజకీయాల్లో ఎదిగేందుకు ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) బృందంలో చేరతాడు. అతడికి రైట్ హ్యాండ్‌గా ఎదిగి ఆ తర్వాత ప్రతిపక్ష నానాజీ (నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే, తన ప్రవర్తన కారణంగా రత్నంకు అందరూ శత్రువులుగా మారతారు. ఫలితంగా టైగర్ రత్నాకర్‌గా ఎదిగిన అతడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాడు? బుజ్జి (నేహా శెట్టి)తో రత్నాకర్ లవ్ ట్రాక్ ఏంటి? ఆమె అతడ్ని ఎందుకు కాల్చాల్సి వచ్చింది? రత్నం కథ చివరికీ ఏమైంది? అన్నది కథ.
విష్వక్.. మంచి మనసు
గత శనివారం (జూన్ 15) హైదరాబాద్‌లో జరిగిన ‘మెట్రో రెట్రో’ కార్యక్రమానికి హాజరైన విష్వక్ సేన్.. అక్కడ కీలక నిర్ణయం తీసకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ కార్యక్రమంలో.. తానూ మరణానంతరం అవయవదానం చేయనున్నట్లు ప్రతిజ్ఞ చేశాడు. ఈ మేరకు తన వ్యక్తిగత వివరాలను సంబంధిత వర్గాలకు అందజేశాడు. ‘దాత అనుమతి కార్డు’ పట్టుకొని విష్వక్ దిగిన ఫొటో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అభిమానులు, నెటిజన్లు ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. కాగా, యంగ్ హీరో విజయ్ దేవరకొండ, జగపతిబాబు, అమీర్‌ఖాన్ తదితర సెలబ్రిటీలు సైతం తాము అవయదానం చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది