కొన్నేళ్ల క్రితం గ్యాస్ బుకింగ్ అంటే తలకు మించిన భారంగా ఉండేది. ఇంట్లో గ్యాస్ అయిపోయిందంటే బుకింగ్ కోసం ఓ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. గ్యాస్ బుక్ పట్టుకొని సంబంధింత ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. ఒక్కోసారి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వెళ్లిన పని అయ్యేది కాదు. ఒకవేళ జరిగిన గ్యాస్ ఎప్పుడు వస్తుందో తెలియక మహిళలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసేవారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. టెక్నాలజీ పెరగడంతో పాటు ప్రతీ ఒక్కరి చేతిలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. దీంతో ఏ పనైనా చిటికెలో జరిగిపోతుంది. ఈ సాంకేతికతను అందిపుచ్చుకున్న గ్యాస్ కంపెనీలు కస్టమర్లకు స్మార్ట్ సర్వీసులు అందించడం ప్రారంభించాయి. దీంతో వినియోగదారులు సులభంగా గ్యాస్‌ను బుక్ చేసుకోవడంతో పాటు.. 24 గంటల్లోనే సిలిండర్‌ను పొందగల్గుతున్నారు.
డిజిటల్ సేవలు
భారత్‌లో ప్రధానంగా మూడు కంపెనీలు LPG గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. హిందూస్థాన్ పెట్రోలియం (HP) గ్యాస్, భారత పెట్రోలియం(Bharat) గ్యాస్, ఇండేన్ గ్యాస్ కంపెనీలు వంట గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థలు తమ వినియోగదారులకు ఆన్లైన్ LPG సిలిండర్ బుకింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్లను కాలింగ్ ద్వారా, వెబ్సైట్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా, UPI, డిజిటల్ వాలెట్ ద్వారా బుక్ చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులో ఉంచాయి. అయితే తాజాగా మరో సరికొత్త ఆప్షన్‌ను ఈ సంస్థలు తీసుకొచ్చాయి. వాట్సప్ ద్వారా కూడా గ్యాస్‌ను బుక్ చేసుకునేందుకు వీలు కల్పించాయి. ఇందుకు సంబంధించిన వాట్సప్ నెంబర్లను కూడా ఆయా గ్యాస్ ఏజెన్సీలు ప్రకటించాయి.
వాట్సప్ బుకింగ్
HP గ్యాస్ కంపెనీ వాట్సప్ ద్వారా సిలిండర్ బుకింగ్ కోసం 9222201122ను ప్రకటించింది. అలాగే భారత్ గ్యాస్ కోసం 1800224344, ఇండేన్ గ్యాస్ కోసం 7588888824 నెంబర్లకు వాట్సప్ మెసెజ్ పెట్టడం ద్వారా మరింత తేలికగా గ్యాస్‌ను పొందొచ్చని సూచించాయి. అయితే గ్యాస్ బుకింగ్‌కు వినియోగించే మొబైల్ నంబర్.. రిజిస్టర్ చేసుకున్నదై ఉండాలి. ఇకపోతే వాట్సప్‌లో గ్యాస్‌ను ఎలా బుక్ చేయాలి? ఎలాంటి స్టెప్స్ ఫాలో కావాలో ఇప్పుడు చూద్దాం.
- ముందుగా మీరు సేవ్ చేసుకున్న సదరు గ్యాస్ కంపెనీ వాట్సప్ నెంబర్‌కి ‘Hi’ (HP Gas అయితే ‘BOOK’, ఇండేన్ గ్యాస్ వారు ‘REFILL’) అని మెసెజ్ చేయాలి.
- వాట్సప్‌లో కాంటాక్ట్ అవ్వగానే ఓ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో గ్యాస్ బుకింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం పేమెంట్ లింక్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి పేమెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నగదు చెల్లింపు కోసం పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే, డెబిట్ కార్డులను వినియోగించవచ్చు
- పేమెంట్ పూర్తయ్యాక గ్యాస్ బుకింగ్ అయినట్లు ఒక మెసెజ్ వస్తుంది. అలాగే వాట్సాప్‌లోనే బుకింగ్ నెంబర్, సిలిండర్ డెలివరీకి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేస్తాయి. అంతే గ్యాస్ బుకింగ్ అయిపోతుంది.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్