సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. మహేశ్ మాస్ యాక్షన్, డ్యాన్స్ ఫ్యాన్స్‌కు కనెక్ట్ అవ్వగా.. ఎమోషనల్ సీన్స్, మదర్ సెంటిమెంట్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకర్షిస్తోంది. కాగా, థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీకి సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. ఈ సినిమా కూడా నెలలోపే స్ట్రీమింగ్‌లోకి రానున్నట్లు బజ్ వినిపిస్తోంది.
ఆ రోజే ఓటీటీలోకి!
గుంటూరు కారం (Guntur Kaaram OTT date) ప్రసార హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. ఫిబ్రవరి 9 నుంచి ఈ చిత్రం ప్రసారమయ్యే అవకాశముందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీనిపై నెట్‌ఫ్లిక్స్ వర్గాల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థియేటర్లలో రిలీజ్ అయ్యాక 28 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసుకునేలా మూవీ టీమ్‌తో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుందని సమాచారం. దీని ప్రకారం ఫిబ్రవరి రెండో వారంలో ఈ చిత్రం స్ట్రీమింగ్కు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఒకవేళ ఆ తేదీన (ఫిబ్రవరి 9) సాధ్యం కాకపోతే ఫిబ్రవరి 16వ తేదీలోగా ఏదో ఒక రోజు నెట్‌ఫ్లిక్స్‌లో ‘గుంటూరు కారం’ (Guntur Kaaram OTT) స్ట్రీమింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది.
10 రోజుల్లో ఎంత వచ్చింది?
సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ‘గుంటూరు కారం’ చిత్రం నేటితో సరిగ్గా 10 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.231 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఒక ప్రాంతీయ చిత్రం పది రోజుల్లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఇదే తొలిసారని పేర్కొంది. ఇది ఆల్‌టైమ్ రికార్డు (Guntur Kaaram All Time Record) అంటూ బహిరంగంగా తమ సంతోషాన్ని ప్రకటించింది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్