సూపర్‌స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాతో ఆల్‌టైమ్ రికార్డు కొల్లగొట్టాడు. జనవరి 12న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల (Guntur Kaaram Collections) జోరు ప్రదర్శిస్తోంది. ఓపెనింగ్ రోజు రూ.94 కోట్లు, సెకండ్ డే రూ.33 కోట్లు, మూడో రోజు రూ.37 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం తొలి వారంలోనే ఏకంగా రూ.212 మొత్తం కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
భారత సినీ చరిత్రలో ప్రాంతీయ భాషలో రిలీజైన ఓ చిత్రం తొలి వారంలోనే ఇలా రూ.212 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం ఇదే తొలిసారి. ఈ అరుదైన ఘనతను సాధించి ‘గుంటూరు కారం’(Guntur Kaaram) ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిందని మేకర్స్ తాజా పోస్టర్ ద్వారా తెలియజేశారు. కాగా, మహేష్ కెరీర్‌లో రూ.200+ గ్రాస్ అందుకోవడం ఇది మూడోసారి. అదే విధంగా టాలీవుడ్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో మహేష్ సినిమాలు ఐదు ఉన్నాయి.
గుంటూరు కారం చిత్రం ద్వారా మహేష్‌బాబు కెరీర్‌లో వరుసగా ఐదోసారి రూ.100+ కోట్ల షేర్ సాధించాడు. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సర్కారు వారి పాట’ సినిమాల ద్వారా ఆయన ఈ ఫీట్ అందుకున్నారు. దీంతో వరుసగా ఐదుసార్లు ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా మహేష్ నిలిచాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా ముడోసారి మహేష్‌తో ‘గుంటూరు కారం’ తెరకెక్కించారు. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ మంచి సక్సెస్ సాధించాయి. తొలుత ‘గుంటూరు కారం’ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు బాగా కనెక్ట్ కావడంతో కలెక్షన్లలో ఆ ప్రభావం కనిపంచలేదు. మహేష్‌బాబు యాక్టింగ్, మేనరిజం, ఫైట్స్‌కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.
ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) నటించగా, మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కీ రోల్ ప్లే చేసింది. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు. కాగా హారికా అండ్ హసిన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుందని టాక్. మార్చి ఆఖరి వారంలో గుంటూరు కారం ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
మహేష్ టాప్-5 కలెక్షన్లు ఇవే!
‘గుంటూరు కారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తూ మరిన్ని రికార్డులను కొల్లగొట్టేందుకు పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో మహేష్ నటించిన చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాలపై ఓ లుక్కేద్దాం.
సర్కారు వారి పాట
పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్ల వసూళ్లు సాధించి మహేష్ సత్తా ఏంటో చూపించింది. ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటించింది.
సరిలేరు నీకెవ్వరు
మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru). రూ.85 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తొలి రోజే రూ. 64.7 కోట్లను వసూలు చేసింది. ఓవరాల్‌గా రూ.214 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
మహర్షి
రూ.90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘మహర్షి’(Maharshi) చిత్రం.. వరల్డ్‌వైడ్‌గా రూ.170.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజునే రూ.48.2 కోట్లు రాబట్టి నిర్మాతలపై కనక వర్షం కురిపించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, పూజా హెగ్డే, జగపతిబాబు ముఖ్యపాత్రలు పోషించారు.
భరత్ అనే నేను
కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమా సైతం మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్ర బడ్జెట్ రూ.95 కోట్లు కాగా.. వరల్డ్‌వైడ్‌గా రూ. 164.9 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించింది.
శ్రీమంతుడు
మహేష్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘శ్రీమంతుడు'(Srimanthudu) ఒకటి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.145.2 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్ సరసన శ్రుతి హాసన్ చేసింది. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు.