• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Harikatha Web Series Review: మిస్టరీ హత్యలు చేసేది దేవుడా? నరుడా?

    నటీనటులు: శ్రీరామ్, దివి, రాజేంద్రప్రసాద్, అర్జున్ అంబటి, పూజిత పొన్నాడ తదితరులు

    డైరెక్టర్‌ : మ్యాగి

    సంగీతం : సురేష్‌ బొబ్బిలి

    సినిమాటోగ్రాఫర్‌ : విజయ్‌ ఉలగనాథ్‌

    ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖి

    నిర్మాత : టి.జి. విశ్వప్రసాద్‌

    ఓటీటీ వేదిక: హాట్‌స్టార్‌

    పలు సూపర్‌ హిట్‌ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓ ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. ‘హరికథ: సంభవామి యుగే యుగే‘ (Harikatha Web Series Review) పేరుతో రూపొందిన ఈ సిరీస్‌ హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్‌, శ్రీరామ్‌, దివి, అంబటి అర్జున్‌ కీలక పాత్రలు పోషించారు. మ్యాగీ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ను థియేటర్‌లో ఎందుకు రిలీజ్‌ చేయలేదని కచ్చితంగా ఫీలవుతారని నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ప్రమోషన్స్ మాట్లాడి భారీగా అంచనాలు పెంచేశారు. ట్రైలర్‌, టీజర్‌ కూడా అదే రేంజ్‌లో ఆకట్టుకున్నాయి. మరి ఈ సిరీస్‌ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్లే మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    1980 – 1990 మధ్య కథ సాగుతుంది. అరుకులోని ఓ గ్రామంలో తక్కువ కులానికి చెందిన హరి (సుమన్) ఓ హత్య కేసులో జైలుకి వెళ్తాడు. మరోవైపు రంగాచారి (రాజేంద్ర ప్రసాద్) భగవంతుణ్ణి నమ్ముతూ విష్ణు అవతారలపై నాటకాలు వేస్తుంటాడు. అయితే ఈ నాటకాలలో ఏ అవతారం ఏ రోజు చేస్తారో అదే రీతిలో అనుమానాస్పదంగా హత్యలు జరగడం మెుదలవుతాయి. దీంతో ఆ భగవంతుడే హత్యలు చేస్తున్నాడని గ్రామస్తులంతా నమ్ముతారు. ఈ హత్యల మిస్టరీని కనుగొనేందుకు పోలీసు అధికారి విరాట్ (శ్రీరామ్‌) రంగంలోకి దిగుతాడు. అతడి దర్యాప్తులో తేలిన నిజాలేంటి? ఆ హత్యలు నిజంగానే భగవంతుడు చేస్తున్నాడా? మరెవరైనా దాని వెనక ఉన్నారా? అసలు హత్యకు గురైన వారు చేసిన తప్పులు ఏంటి? జైలుకెళ్లిన హరి (సుమన్‌) స్టోరీ ఏంటి? అన్నది తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్ (Harikatha Web Series Review) ఈ సిరీస్‌లో మరోమారు తన నట విశ్వరూపం చూపించాడు. కెరీర్‌లో ఇప్పటివరకూ పోషించని పాత్రలో అదరగొట్టారు. విష్ణుమూర్తి దశావతారాల్లో చక్కగా ఒదిగిపోయారు. తన హావభావాలతో ప్రేక్షకులకు గూస్‌బంప్స్‌ తెప్పించారు. పోలీసు ఆఫీసర్‌గా శ్రీరామ్‌ ఆకట్టుకున్నాడు. మిస్టరీని ఛేదించాలని తపన పడే పోలీసు పాత్రలో చెరగని ముద్ర వేశారు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివికి చాన్నాళ్ల తర్వాత ప్రాధాన్యం ఉన్న పాత్ర తగ్గింది. అడవి పిల్లగా ఆమె క్యారెక్టరైజేషన్‌ బాగుంది. ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ ఓ సర్‌ప్రైజ్‌ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. మరో నటి పూజిత పొన్నాడ నటన కంటే గ్లామర్‌గా మంచి మార్కులు కొట్టేసింది. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు మ్యాగీ 1980ల కాలం నాటి స్టోరీని తీసుకొని దశావతారలను రిలేట్‌ చేస్తూ రాసుకున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ లైన్‌ ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక టచ్‌తో సాగిన పలు సన్నివేశాలు మెప్పించాయి. అలాగే హత్యల చుట్టూ సస్పెన్స్‌ క్రియేట్‌ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఒక్కో అవతరానికి తగ్గట్లు డిజైన్‌ చేసిన హత్యలు గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. దర్శకుడు మంచి కాన్సెప్ట్‌నే ఎంచుకున్నప్పటికీ రొటీన్‌ రీవెంజ్‌ డ్రామాగా కథను నడిపించడం నిరాశ పరుస్తుంది. చాలా వరకూ సీన్స్‌ ఎక్కడో చూసిన ఫీలింగ్‌ను కలిగించాయి. అసందర్భమైన పాటలు సైతం సిరీస్‌ ఫ్లోను దెబ్బతీశాయి. సరైన కథనం లోపించడం, కథలో ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో ఈ సిరీస్ చాలా వరకూ బోరింగ్‌గా అనిపిస్తుంది. అభ్యంతరకరమైన డైలాగ్, సీన్స్ లేకపోవడం ఫ్యామిలీ ఆడియన్స్‌కు కలిసొచ్చింది. 

    సాంకేతికంగా.. 

    టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Harikatha Web Series Review) సినిమాటోగ్రఫీ వర్క్‌ బాగుంది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ విజువల్స్‌ ఆకట్టుకున్నాయి. గ్రాఫిక్స్ డిపార్ట్‌మెంట్‌ పనితీరులో లోపాలున్నాయి. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌లో నాణ్యత లోపించింది. సురేష్‌ బొబ్బిలి సంగీతం పర్వాలేదు. జునైద్‌ సిద్ధిఖి ఎడిటింగ్‌ ఓకే. ఇంకొన్ని కత్తెరలు పెట్టినా నష్టం లేదు. నిర్మాణ విలువలు సిరీస్‌కు తగ్గట్లు ఉన్నాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • ప్రధాన తారాగణం నటన
    • డివోషనల్‌ టచ్‌
    • సినిమాటోగ్రఫీ

    మైనస్‌ పాయింట్స్‌

    • రొటిన్‌ రివేంజ్‌ డ్రామా
    • బోరింగ్‌ సన్నివేశాలు
    • వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌
    Telugu.yousay.tv Rating : 2.5/5 
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv