పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు‘ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. నేడు (ఆగస్టు 17) పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో నిధి అదరగొట్టింది. మహారాణి గెటప్‌లో ఒంటిపై ఆభరణాలతో ఆమె మరింత అందంగా కనిపించింది. అసలే షూటింగ్ జరగట్లేదన్న ఆందోళనలో ఉన్న మెగా ఫ్యాన్స్‌కు నిధి పోస్టర్ సంతోషాన్ని కలిగిస్తోంది.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్‘ చిత్రంలోనూ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ సెట్స్‌లో నిధి బర్త్ డే వేడుకలను నిర్వహించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నిధి హైదరాబాద్‌లోనే జన్మించింది. కానీ, పెరిగింది మాత్రం బెంగళూరు. బాలీవుడ్‌లో మున్నా మైఖేల్ సినిమా ద్వారా అడుగుపెట్టి తొలి ప్రయత్నంలోనే జీసినిమా బెస్ట్ డెబ్యూ అవార్డు అందుకుంది.
నాగ చైతన్య హీరోగా చేసిన ‘సవ్యసాచి‘ సినిమాతో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో చిత్ర పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.
ఆ తర్వాత చైతూ సోదరుడు అక్కినేని అఖిల్ పక్కన ఈ అమ్మడికి అవకాశం దక్కింది. ‘మిస్టర్ మజ్ను‘లో వారిద్దరు కలిసి చేశారు. అది కూడా ఫెయిల్ అయింది.
అక్కినేని హీరోలతో చేసిన రెండు సినిమాలూ ఫ్లాపవడంతో నిధి కెరీర్ డేంజర్ జోన్‌లో పడింది. దీనితో నిధికి టాలీవుడ్ లోనూ చుక్కెదురయింది.
అవకాశాలు సన్నగిల్లాయి అనుకుంటున్న సమయంలోనే పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’లో నిధికి అవకాశం దక్కింది. ఆ మూవీ హిట్ కావడంతో నిధికి వరుస ఆఫర్లు వచ్చాయి.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీలో నిధి హీరోయిన్‌గా ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచింది. పవన్ ఈ సినిమాకు షెడ్యూల్స్ ఇవ్వకపోవడంతో సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది.
ఓ వైపు తెలుగు చిత్రాల్లో నటిస్తూనే తమిళంలోనూ ఈ అమ్మడు పలు సినిమాలు చేసింది. ‘ఈశ్వరన్’, ‘కలగ తలైవన్’ చిత్రాలతో తమిళ ప్రేక్షకులను పలకరించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ నిధి చాలా చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తుండటంతో ఇన్‌స్టాగ్రామ్‌లో నిధిని అనుసరించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టా ఖాతాను 29.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్