• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డేటింగ్ యాప్‌లలో ఎలా సురక్షితంగా ఉండాలి?

     దేశంలో డేటింగ్ యాప్స్ ప్రభావం చాలా వరకు విస్తరించింది. ‘ఫారెన్ అమ్మాయితో తెలంగాణ అబ్బాయి ప్రేమ పెళ్లి’. ‘ రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఇద్దరి మధ్య ప్రేమ, లివింగ్ రిలేషన్’.  ఇటువంటి వార్తలు రోజు వింటున్నాం కదా!  నిజమే, డేటింగ్ యాప్స్ ద్వారా కొందరు ఒక్కటవుతుంటే. మరికొందరు అవకాశంగా ఉపయోగించుకొని వేధింపులకు పాల్పడుతున్నారు.. ఈక్రమంలో  డేటింగ్ యాప్‌లో తీసుకోవాల్సి జాగ్రత్తలు, చేయకూడని పనులు ఏంటో ఓసారి పరిశీలిద్దాం..

    జాగ్రత్తలు

    • దేశంలో చాలా డేటింగ్ యాప్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి ఎంచుకోవటం కాస్త కష్టమైన పనే. ఆన్ లైన్ డేటింగ్ చేసేటప్పుడు చాలా విషయాల గురించి కచ్చితంగా తెలిసి ఉండాలి. ఇలాంటి సమయంలో ముఖ్యంగా భారతీయుల కోసం కొన్ని టిప్స్.
    • ఏదైనా డేటింగ్ యాప్ ను ఎంచుకునేటప్పుడు కచ్చితంగా దాని గురించి కొంత సమాచారం సేకరించాలి. వివిధ వెబ్ సైట్ లో వాటి గురించి వెతికి సమాచారం తెలుసుకోవాలి. యాప్ ఎంతవరకు సురక్షితమైనది, దాని రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. 
    • వ్యక్తిగత సమాచారం ఇచ్చే మందుకు జాగ్రత్త వహించాలి. మనకు నష్టం కలిగించని సమాచారం మాత్రమే ఇవ్వాలి. సెక్యూర్ మెసేజింగ్ ను మాత్రమే వాడాలి. 
    • డేట్  ప్రారంభించిన కొద్దిరోజుల వరకు  పబ్లిక్ ప్లేసుల్లోనే తిరగండి. ఏదైనా తప్పు జరుగుతుంది అనిపిస్తే జనాల్లో ఉంటారు కనుక నమ్మకంగా ఉంటారు. 
    • మీ నిర్ణయంపైనా నమ్మకంతో ఉండాలి. ఒకవేళ మీరు మాట్లాడుతున్న వారు నచ్చకపోతే ఆ సంభాషణలు అక్కడితో ఆపేసి బ్లాక్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. 

    ఇలాంటి పనులు వద్దు

    • ఆన్ లైన్  డేటింగ్ లో ఎలాంటి  ఆందోళన లేకుండా సజావుగా సాగాలంటే కొన్ని పనులు అసలు చేయకూడదు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. 
    • ఆన్ లైన్ లో పరిచయం ఏర్పడిన వారితో వెంటనే అడ్రస్, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ వంటి వివరాలు పంచుకోవద్దు. 
    • మీరు ఎవరినైనా కలిసేటప్పుడు జనసమూహం ఉండే ప్రాంతంలో కలిసేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఎక్కడికి వెళ్తున్నారో స్నేహితులకు లేదా కుటుంబసభ్యుల్లో ఎవరికో ఒకరికి తెలిసి ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. 
    • ఆన్ లైన్ లో పరిచయమైన వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పంపించకండి .అది ఎలాంటి కారణమైనా సరే వదిలేయాలి.
    • ఎవరైనా అశ్లీలమైన ఫొటోలు పంపించాలని అడిగితే అక్కడితో ఆ డేటింగ్ ను వదిలేయాలి. 
    • యాప్ లో ఏదైనా గందరగోళం ఏర్పడితే నిర్మోహమాటంగా నిర్వహకులకు ఫిర్యాదు చేసేందుకు ఆలోచించ వద్దు. 

    బంధాన్ని సురక్షితంగా ముగించడం

    డేటింగ్ యాప్స్ ను ఎంచుకోవటం పరిచయాలు పెంచుకోవటం ఒక ఎత్తైతే వాటిని నిలబెట్టుకోవటం ముఖ్యమే. పూర్తిగా తెలియకుండానే అతిగా చనువు ఇచ్చి ఇబ్బందులు కొని తెచ్చుకోకపోవటం మంచిది. సమయానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తూ నమ్మకం కలిగిన తర్వాతే ముందుకు వెళ్లాలి. ముఖ్యంగా అమ్మాయిలు మరింత అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ఎలాంటి సమస్య లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. ఏ చిన్న పొరపాటు చేసినా అంతే సంగతులు. 

    పరిచయం పెంచుకోవటమే కాదు అవసరమైనప్పుడు తెగదెంపులు చేసుకోవటం అది కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముగించడం ముఖ్యం. అవతలి వ్యక్తిని మీరు కలవకపోతే వారికి ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా మీరు ఏం అనుకుంటున్నారో తెలపాలి. మేసేజ్ లేదా ఈ మెయిల్ ద్వారా అయినా పంపించవచ్చు. కానీ, ముఖ్యంగా విడిపోయేటప్పుడు అది కచ్చితంగా గౌరవంతో ముగించాలి. అవతలి వారు నొచ్చుకునేలా ఏ పని చేయవద్దు. ఎందుకు రిలేషన్ ను కొనసాగించాలనుకోవట్లేదో చెప్పి కృతజ్ఞతలు తెలపడం మంచింది.  బంధాన్ని కొనసాగించలేమని చెప్పినప్పుడు అవతలి వ్యక్తులు కోపంతో మాట్లాడి నచ్చజెప్పడానకిి ప్రయత్నిస్తే…ఓపిగ్గా ఉండి మరోసారి నిర్ణయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. మీకు రిలేషన్ ను అక్కడితో ఆపే హక్కు ఉందని గుర్తుంచుకోవాలి. ఒక్కసారి ముగిసి పోయిన తర్వాత ఫోన్ నంబర్ , సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని బ్లాక్ చేస్తే మంచింది. మరోసారి వారితో మాట్లాడానికి కుదరకుండా ఉండటంతో పాటు ఇబ్బందులు తలెత్తవు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv