• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL 2023: సీజన్ ప్రారంభానికి ముందే కీలక ఆటగాళ్లు దూరం…అవకాశం దక్కేది ఎవరికో?

    ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)కి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. మార్చి 31 నుంచి 16వ సీజన్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్‌లో భాగంగా కీలకమైన ఆటగాళ్లు గాయాల బారిన పడి దూరం కావటం ఫ్రాంఛైజీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతమున్న జట్లలో కొంతమంది ప్లేయర్లు దూరమవుతుండగా.. మరికొందరు ఆడటంపై అనుమానాలు ఉన్నాయి. ఆ సంగతులేంటో తెలుసుకోండి. 

    ముంబయికి ఎదురుదెబ్బ

    గతేడాది ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన చేసిన ముంబయికి ఈ సారి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జస్ప్రిత్ బుమ్రా సీజన్‌కు దూరం కానున్నాడు. కొన్ని నెలలుగా గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న అతడు శస్త్ర చికిత్సకు వెళ్తుండటంతో IPL ఆడటం లేదు. ప్రస్తుతం NCAలో చికిత్స పొందుతున్నాడు బుమ్రా. కానీ, ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అతడి స్థానాన్ని భర్తీ చేస్తాడని అందరూ భావిస్తున్నారు. ఇక బుమ్రా స్థానంలో ధవల్ కులకర్ణి, బేసిల్ థంపీ, సందీప్ శర్మకి అవకాశం దక్కవచ్చు. 

    ముంబైకి చెందిన మరో కీలకమైన బౌలర్ జో రిచర్డ్‌సన్‌ కూడా ఐపీఎల్‌ నుంచి ఔట్ అయ్యాడు. కోటిన్నరకు అతడిని కొనుగోలు చేశారు. అతడి ప్లేస్‌ను మెరిడిత్, టామ్ కుర్రాన్‌లో ఎవరితో భర్తీ చేస్తారో చూడాలి.

    చెన్నైకి షాక్‌

    న్యూజిలాండ్ ఆటగాడు కైలీ జేమిసన్‌ను రూ. కోటికి దక్కించుకుంది చెన్నై. కానీ, అతడు వెన్ను నొప్పి కారణంగా సీజన్‌కు దూరమయ్యాడు. డ్యాడీస్ టీంలో ఈ పేసర్‌ సూపర్‌ బౌలర్. ప్రస్తుతం అతడి స్థానాన్ని శ్రీలంక ఆల్‌రౌండర్‌ దసున్ శనాకతో భర్తీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

    రాయల్స్‌కు కష్టమే

    సంజూ శాంసన్ సారథ్యం వహిస్తున్న రాజస్థాన్ రాయల్స్‌లో మేటి బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ. ఇటీవల వెన్ను గాయం కారణంగా ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్ చేశాడు. దీంతో ఐపీఎల్‌ ఆడటం లేదని తెలిసిపోయింది. ప్రసిద్ధ్‌ను రూ. 10 కోట్లకు RR ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో వరుణ్ అరోణ్‌కు అవకాశం కల్పించవచ్చు.

    దిల్లీ సారథి ఎవరో?

    దిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అతడు కోలుకోవటానికి నెలల సమయమే పడుతుంది. దీంతో దిల్లీ క్యాపిటల్స్‌కు ఎవరు సారథ్యం వహిస్తారనే అంశంపై చర్చ సాగుతోంది. మరోవైపు అతడి స్థానంలో వికెట్ కీపర్‌గా షెల్డన్ జాక్సన్‌, లవనీత్ సిసోడియాకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. 

    ఇటీవల దేశవాలీ క్రికెట్‌లో సూపర్‌ ఫామ్‌తో మెరిసిన సర్ఫరాజ్ కూడా గాయపడటంతో ఐపీఎల్ ఆడటం అనుమానమే. ఫలితంగా మరో బ్యాట్స్‌మెన్‌ను దిల్లీ కోల్పోయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv