“ఇళయ రాజా”.. ఈ పేరు వినని భారతీయులు ఉంటారా. సంగీతం సామ్రాజ్యాన్ని ఒక 3 దశాబ్దాలపాటు ఏలిన Musical మాస్ట్రో అతను. ఇళయరాజా పాటలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు అన్నట్లుగా ఉంటాయి. 1980’s, 1990’s లో దాదాపు 80 శాతం సినిమాలకు ఆయన మ్యూజిక్ Compose చేశారు. సినిమా హిట్ అవడంలో సంగీతం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలా.. ఇళయరాజా వల్లే ఎన్నో సినిమాలు కథలో బలం లేకపోయినా కేవలం పాటల వల్లే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. ఆయన 1943 మదురై సంస్థానంలో జన్మించారు. ఇళయరాజా పేరుని రాజయ్యగా మార్చిఆయన తండ్రి అతన్ని స్కూల్లో చేర్పించారు. అక్కడే ఇయాళరాజా కి సంగీత భీజం పడింది. అప్పటి తమిళనాడు ప్రముఖ Musician Dhanraj మాస్టర్ దగ్గర ఇళయరాజా సంగీతం నేర్చుకున్నారు. ఆయనే రాజయ్య పేరుని రాజా గా మార్చారు. ఇయాళయరాజా తన కెరీర్ లో మొదట Compose చేసింది Annakili (1976) అనే చిత్రానికి. ఈ మూవీ ప్రొడ్యూసర్ రాజా పేరు ముందు ఇళయ చేర్చారు. తమిళ్ లో ఇళయ అంటే “చిన్న వాడు”. అలా జ్ఞానదేశికన్ పేరు రాజయ్య, రాజా నుంచి ఇళయరాజా గా మారిపోయింది.
ఇళయరాజా తన కెరీర్ లో ఇప్పటికి వెయ్యికి పైగా చిత్రాలకి మ్యూజిక్ compose చేశారు. కేంద్రప్రభుత్వం ఆయన్ను 2010లో పద్మ భూషణ్, 2018 లో పద్మ విభూషణ్ తో సత్కరించింది. ఇళయరాజా కొడుకు యువన్ శంకర్ రాజా కూడా సౌత్ మ్యూజిక్ ఇండస్ట్రీ ని ఏలుతున్న విషయం తెలిసిందే. ఇళయరాజా తెలుగులో compose చేసిన “స్వర్ణకమలం, అభినందన, ప్రేమ, బొబ్బిలి రాజా, సితార, ఓ పాపా లాలి, ఇంకా ఎన్నో మరిచిపోలేనవి ఉన్నాయి .
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం