సాధారణంగా ఓటీటీ ప్రేక్షకులు క్రైమ్, హార్రర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లను ఎక్కువగా ఆదరిస్తుంటారు. ఇక జానర్ చిత్రాలు/సిరీస్‌లు కాస్త హిట్ తెచ్చుకున్నా సరే రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి. ఈ కోవలోనే నవీన్ చంద్ర (Naveen Chandra) లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ వచ్చి చేరింది. నవీన్ నటించిన ‘ఇన్‌స్పెక్టర్ రిషి‘ (Inspector Rishi OTT) సిరీస్.. అమెజాన్‌లో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ఓటీటీ ప్రేక్షకులు ఈ సిరీస్‌ను చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అంతగా ఆకట్టుకునే అంశాలు ఈ సిరీస్‌లో ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం.
నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్
‘ఇన్‍స్పెక్టర్ రిషి’ వెబ్ సిరీస్‍ను మహిళ డైరెక్టర్ నందిని జేఎస్ (Nandini JS) తెరకెక్కించారు. అడవిలో జరిగే వరుస హత్యలను ఛేదించే ‘ఇన్‍స్పెక్టర్ రిషి’ పాత్రను నవీన్ చంద్ర పోషించాడు. వీరితో పాటు సునైనా ఎల్లా, శ్రీకృష్ణ దయాల్, ఎలాంగో కుమారవేల్, కన్నా రవి, మాలినీ జీవరత్నం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 29న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ (Amazon Prime)లో విడుదలైన ఈ సిరీస్.. అప్పటి నుంచి అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తోంది. తాజాగా వచ్చిన అన్ని చిత్రాలు, సిరీస్‌లను వెనక్కి నెట్టి అమెజాన్‌లో ఇండియా వైడ్‌గా నెంబర్‌వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన రివ్యూలు కూడా పాజిటివ్‌గా ఉండటంతో దీనిని చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.
కథేంటి?
ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. కోయంబత్తూరుకు 50 కి.మీ దూరంలో తేన్ కాడ్ అనే దట్టమైన అడవి ఉంటుంది. ఆ ఫారెస్టును ఆసరాగా చేసుకుని ఓ తండా ప్రజలు జీవిస్తుంటారు. ఓ రోజు రాబర్ట్ అనే ఫోటోగ్రాఫర్ డెడ్ బాడీ చెట్టుకు వేలాడుతూ కనిపిస్తుంది. ఆ మృతదేహానికి సాలీడు గూడు కట్టి ఉండటం అనుమానాలు రేకెత్తిస్తుంది. ఈ కేసును చేధించడానికి ఇన్‌స్పెక్టర్ రిషి (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. గతంలో ఇలాగే చాలా మంది చనిపోయినట్లు కేసు విచారణలో అతడికి తెలుస్తుంది. మరోవైపు ఫారెస్ట్‌లో విచిత్ర ఆకారం సంచరిస్తూ అందర్ని భయపెడుతుంటుంది. మరి ఈ కేసును రిషి ఎలా ఛేదించాడు? దర్యాప్తులో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? హత్యకు గురైన బాడీల చుట్టూ సాలీడు గూడు పెట్టడానికి కారణం ఏంటి? అడవిలో తిరుగుతన్నది దయ్యమా లేక వన దేవతా? ఆ ఆకారానికి, హత్యలకు ఏంటి సంబంధం? అన్నది కథ.
థ్రిల్ చేసే ట్విస్టులు
క్రైమ్ అండ్ థ్రిల్లర్, మిస్టరీ జానర్‌లో తెరకెక్కడంతో ఈ సిరీస్ ఆసాంతం ఆసక్తిగా సాగుతుంది. ఎక్కడా బోర్‌కొట్టకుండా దర్శకురాలు ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మెుత్తం 10 ఏపిసోడ్స్ ట్విస్టులతో నిండి ఉంటుంది. చివరి వరకూ సస్పెన్స్‌ను మెయిన్‌టెన్ చేస్తూ మంచి హారర్ థ్రిల్లర్‌ను అందించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇన్‌స్పెక్టర్ పాత్రలో నవీన్ చంద్ర ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సునైనా ఫారెస్టు గార్డుగా సహజమైన నటనతో కట్టిపడేసింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయ్యింది. ఫారెస్టు లొకేషన్లు కూడా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ పనితనాన్ని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ‘ఇన్‌స్పెక్టర్ రిషి’ చూడనివారు ఈ వీకెండ్ చూసేయండి. కచ్చితంగా థ్రిల్ అవుతారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!