• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముంబై టూ అహ్మదాబాద్: ఇండియా ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ గురించి ఆసక్తికర విషయాలు

    కళ్లు మూసి తెరిచే‌లోపు రయ్‌మంటూ దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్లు ఎక్కువగా ఎక్కడుంటాయి అంటే ఠక్కున గుర్తొచ్చే ఆన్సర్ జపాన్. కానీ జపాన్ కంటే మనం త‌క్కువేమి కాదని భారత్ ఓ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపడుతుంది. ఇంతకి ఆ ప్రాజెక్టు విశేషాలు ఏంటి..? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ ట్రైన్ నడుస్తుంది లాంటి ఆసక్తికర విషయాలు మీరు తెలుసుకోండి.

    ప్రాజెక్టు విషయాలు

    గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం నుంచి మహరాష్ట్ర‌లోని ముంబై వరకు ఈ బుల్లెట్ ట్రైన్ నడువనుంది. ముంబై- అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్(MAHSR) పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ ట్రైన్‌ 320 కి.మీ వేగంతో దూసుకెళ్తుందని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేర్కొంది. దాదాపు రెండు నగరాల మధ్య ఉన్న 508 కి.మీ దూరానికి 12 రైల్వే స్టేష‌న్స్ ఉండ‌నున్నాయి. జపాన్‌లోని షింకన్‌సెన్ ప్రాజెక్టులో ఉపయోగించిన సిగ్నల్ వ్యవస్థనే ఈ ప్రాజెక్టులో కూడా ఉపయోగిస్తున్నారు.

    ప్రత్యేకతలు

    ఈ బుల్లెట్ ట్రైన్ అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంటుంది. ప్రధానంగా ఈ ట్రైన్‌లోని కోచ్‌లను 3 కేటగిరీలుగా విభజించారు. ఈ కేటగిరీలలో వివిధ రకాలైన సౌకర్యాలు కల్పించారు. అవేంటంటే..?

    ఫస్ట్ క్లాస్: మోడ్రన్ ప్యాసింజర్లకు అనువైన సౌకర్యాలు ఈ కేటగిరీలో కల్పించనున్నారు. విమానాల్లో మాదిరిగానే బ్యాగేజ్ ర్యాక్స్, ఎల్‌ఈడీ లైట్లు, రీడింగ్ ల్యాంప్స్ ఏర్పాటు చేయనున్నారు. సీట్‌ను కూర్చొవడానికి అనువుగా మార్చుకునే వెసులుబాలు కూడ ఉండనుంది.

    బిజినెస్ క్లాస్: ఈ కేటగిరిలో కూడ ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ క్లాస్‌లో మాదిరిగానే ఫెసిలిటీస్ కల్పించనున్నారు. అలాగే మొబైల్, ల్యాప్‌ట్యాప్‌లు ఛార్జ్ చేసుకోవడానికి 

    మోడ్ర‌న్ ఔట్‌లెట్‌లు సిద్ధం చేస్తున్నారు.

    స్టాండర్డ్ క్లాస్ : అన్ని కేటగిరీల ప్రయాణికులకు అనుకూలంగా ఈ కోచ్ ఉంటుంది. ప్యాసింజర్లకు అవసరమైన కనీస సౌకర్యాలతో ఇది ఏర్పాటు అవుతుంది. .

    ఇతర సౌకర్యాలు

    బుల్లెట్ ట్రైన్ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టేషన్లు, వాటి వివరాలను హిందీ, ఇంగ్లీష్, మరాఠి, గుజరాతీ భాషల్లో అనౌన్స్ చేయనున్నారు. అలాగే తదుపరి స్టేషన్, మనం దిగాల్సిన స్టేషన్ వివరాలను కూడ ఈ భాషల్లో డిస్ ప్లే చేయనున్నారు. దీనికి తోడు దివ్యాంగులకు వీల్‌చైర్లు కూడ అందుబాటులో ఉంటాయి. భారీ వ్యయంతో అంచెలంచెలుగా ఎదుగుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోను మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆకట్టుకునే విజువల్స్‌తో రూపుదిద్దుకున్న ఈ వీడియోనూ మీరూ చూసేయండి. వందే భారత్‌లో భాగంగా ఇండియాలో మరిన్ని ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv