ఎల్లుండి నుంచే ‘వందేభారత్’ పరుగులు
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ విర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు మోదీ విర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభిస్తారు. సికింద్రాబాద్‌లో జరిగే ఈ కార్యక్రమానికి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు మఖ్య అతిథులుగా హాజరవుతారు. కాగా ఈ రైలుపై విశాఖలో దుండగులు రాళ్ల దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు.