ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQOO) కొత్తగా మరో 5G ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.
ఐక్యూ జెడ్ 7ఎస్ 5జీ (iQOO Z7s 5G) పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ మెుబైల్ సేల్స్ భారత్‌లో మెుదలైపోయాయి. ఐక్యూ మెుబైల్స్‌కు భారత్‌లో మంచి క్రేజ్ ఉండటంతో కొత్తగా లాంచ్ అయిన ఫోన్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటి? అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఏమున్నాయి? ధర ఎంత? వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం.
ఫోన్ డిస్‌ప్లే
iQOO Z7s 5G ఫోన్ డిస్‌ప్లేను 6.38 అంగుళాలతో తీసుకొచ్చారు. ఈ ఫోన్ ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90 Hz రిఫ్రెష్ రేటుతో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో ఫోన్ తీసుకొచ్చారు.
ఫోన్ స్టోరేజ్
iQOO Z7s 5G ఫోన్‌ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. 6GB RAM + 128GB, 8GB RAM + 128GB వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది. స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో అల్ట్రా గేమ్ మోడ్, మోషన్ కంట్రోల్స్ లాంటి గేమింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి
కెమెరా
iQOO Z7s 5G ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరాలను అమర్చారు. ఇందులోని ప్రైమరీ కెమెరా 64MP కలిగి ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్‌తో వస్తోంది. బ్యాక్ కెమెరా సెటప్‌లో 2MP Bokeh కెమెరా కూడా ఉంది. ఫ్రంట్ కెమెరాను 16 MPతో తీసుకొచ్చారు. దీనితో నాణ్యమైన సెల్ఫీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.
బ్యాటరీ
iQOO Z7s 5G ఫోన్‍ను 4,500mAh బ్యాటరీతో రూపొందించారు. 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 23 నిమిషాల్లోనే 50 శాతం మేర ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చని ఐక్యూ కంపెనీ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్‌లో పేర్కొంది.
కలర్స్
iQOO Z7s 5G ఫోన్ రెండు రంగుల్లో మార్కెట్‌లో లభ్యమవుతోంది. నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ కలర్స్‌లో మీకు నచ్చిన రంగును ఎంపిక చేసుకోవచ్చు.
ధర ఎంతంటే?
iQOO Z7s 5G ఫోన్.. అమెజాన్‌తో పాటు ఐక్యూ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. 8GB RAM + 128GB మోడల్‌ను రూ.19,999 కొనుగోలు చేయవచ్చు.
Buy Now
ఆఫర్లు
iQOO Z7s 5G ఫోన్‌పై అమెజాన్‌లో ఆఫర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ను HDFC బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1500 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం