• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kajal Karthika OTT:  ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన కాజల్ అగర్వాల్ హర్రర్ చిత్రం.. ఎందులో అంటే?

    కాజల్‌ (Kajal Aggarwal), రెజీనా (Regina Cassandra) ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘కరుంగాపియం’ (Karungaapiyam). ‘కాజల్‌ కార్తీక’ (Kajal Karthika) పేరుతో ఈ సినిమా గతేడాది జులైలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా తమిళంలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహా(Aha)లో ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. 

    నలుగురు హీరోయిన్లు

    ‘కాజల్‌ కార్తీక’ సినిమాలో మెుత్తం నలుగురు హీరోయిన్లు నటించారు. కాజల్‌, రెజీనాతో పాటు రైజా విల్సన్, జనని కూడా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. నలుగురు హీరోయిన్లు ఒకే తెరపై కనిపించనుండటం, అది కూడా హార్రర్‌ సినిమా కావడంతో తమిళంలో ‘కరుంగాపియం’పై అప్పట్లో మంచి హైప్‌ ఏర్పడింది. కానీ సినిమా రిలీజ్‌కు చాలా సమయం తీసుకోవడంతో మెల్లగా ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వచ్చింది. దీంతో థియేటర్లలో సినిమా వచ్చినా కూడా ఆడియన్స్‌ పెద్దగా పట్టించుకోలేదు. తమిళంలో ఎక్కువగా హైప్ లేకపోవడంతో తెలుగులో కూడా ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. 

    ఆహాలో సక్సెస్ అయ్యేనా?

    ఆహా (Aha)లో విడుదలయిన తర్వాత ‘కాజల్‌ కార్తిక’ ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవుతుందని చిత్ర నిర్మాతలు అంచనా వేస్తున్నారు.  తమిళంలో పేవ్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని.. తెలుగులో ముత్యాల రామదాసు సమర్పణలో వెంకట సాయి ఫిల్మ్స్ బ్యానర్‌పై టి. జనార్ధన్ రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో షెర్లీస్ సేత్, యోగి బాబు, జాన్ విజయ్ వంటి నటీనటులు కూడా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇందులో కమెడియన్‌ యోగి బాబు పాత్ర మాత్రం ప్రేక్షకులను నవ్వించేలా ఉంటుంది.

    కథేంటంటే

    ఈ సినిమాను లాక్‌డౌన్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఐదు కథలతో తెరకెక్కించారు. కథలోకి వెళ్తే.. కార్తీక (రెజీనా).. కాలక్షేపం కోసం ఓ పాత లైబ్రరీకి వెళ్తుంది. అక్కడ ఆమెకు వందేళ్ల క్రితం రాసిన ‘కాటుక బొట్టు’ అనే పుస్తకం కనిపిస్తుంది. పురాతన గ్రంథంలా కనిపించిన ఆ పుస్తకాన్ని చూసిన వెంటనే ఆమెకు చదవాలనిపిస్తుంది. అయితే, ఆమె పుస్తకంలో చదివే పాత్రలన్నీ దెయ్యాలుగా మారి ఒక్కొక్కటిగా ఆమె ముందుకు వస్తుంటాయి. అలా, ఆమె ముందుకు వచ్చిన ఓ పాత్ర కార్తీక (కాజల్‌). గ్రామస్థుల వల్ల మరణించిన కార్తీక.. పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటుంది. ఆమె పగ ఎలా తీరింది? ఆమె మరణానికి కారణం ఏంటి? కార్తీక (రెజీనా), కార్తీక (కాజల్‌)కు ఉన్న సంబంధం ఏంటి? మిగిలిన నాలుగు కథలు ఏవి? అన్నది కథ. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv