పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం గ్లోబల్ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం జూన్ 27న (Kalki Release Date) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో మేకర్స్.. మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం (జూన్ 10) కల్కి ట్రైలర్ (Kalki Trailer In Telugu)ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసే ఎలివేషన్స్‌తో ఈ ట్రైలర్ అదరగొట్టింది. హాలీవుడ్ రేంజ్‌లో ఉన్న కల్కి ట్రైలర్‌ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో పాటు కొత్త ప్రశ్నలు రేకెత్తేలా చేసింది. అవేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
ప్రభాస్.. కల్కినే కాదట!
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం.. సెట్స్‌పైకి వెళ్లినప్పటి నుంచి ఈ సినిమా కథ ఇదేనంటూ చాలా రకాల స్టోరీలు సోషల్ మీడియాలో వైరల్‌గా అయ్యాయి. కథను ఎక్స్‌క్లూజివ్‌గా తామే అందిస్తున్నామన్న రీతిలో కొన్ని పేజీలు.. మూవీ ప్లాట్స్‌ను తమకు నచ్చిన విధంగా రాసుకొచ్చాయి. అయితే ఎక్కువ మంది ప్రచారం చేసిన స్టోరీ.. కాస్త కన్విన్సింగ్‌గా ఉన్న కథ ప్రకారం.. ఈ సినిమా కలియుగం చివరిలో జరుగుతుందని, విష్ణు పదవ అవతారమైన కల్కి (ప్రభాస్) వచ్చి భూమి మీద ఉన్న మనుషులను కాపాడతారని అనుకుంటూ వచ్చారు. అయితే తాజా ట్రైలర్ చూసిన తర్వాత అసలు ప్రభాస్ కల్కినే కాదని తెలిసి అంతా షాకయ్యారు. మరి ప్రభాస్ పాత్ర ఇందులో ఉండనుంది? మరి టైటిల్‌లోని కల్కి ఎవరు? అని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. నాగ్ అశ్విన్ ఏం ట్విస్ట్ ప్లాన్ చేశాడో అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
ప్రభాస్ ప్రాధాన్యత తగ్గిందా!
కల్కి ట్రైలర్‌ను పరిశీలిస్తే.. ప్రభాస్ కంటే బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) పాత్రనే హైలెట్‌గా కనిపించినట్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్‌కు తగ్గ ఎలివేషన్స్ ట్రైలర్‌లో ఉన్నప్పటికీ అమితాబ్ క్యారెక్టర్‌కు ఇచ్చిన ప్రాధాన్యతతో పోలిస్తే అది కాస్త తక్కువేనని పోస్టులు పెడుతున్నారు. అయితే సినిమా కోసం ప్రభాస్ పాత్రను దాచి ఉంచారమోనన్న వాదన కూడా నెట్టింట బలంగా వినిపిస్తోంది. ‘రికార్డ్స్ చెక్ చేసుకో.. ఇప్పటివరకూ నేను ఏ ఫైట్ ఓడిపోలేదు’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్స్ ఇందుకు ఒక చిన్న ఉదాహరణ అని చెబుతున్నారు. జూన్ 27న ప్రభాస్ చేసే యాక్షన్‌తో థియేటర్లు మోతెక్కిపోతాయని నమ్మకంగా చెబుతున్నారు.
దీపికా డబ్బింగ్‌పై ట్రోల్స్
కల్కి సినిమాను పరిశీలిస్తే ఇందులోని యాక్టర్లంతా దాదాపుగా తమ పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. విభిన్నమైన గెటప్‌లో ఉన్న లోకనాయకుడు కమల్ హాసన్‌ను అయితే చాలా మంది డబ్బింగ్ వల్లే గుర్తుపట్టారు. అయితే ట్లైలర్‌లో దీపికా డబ్బింగ్ చూసి ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దీపిక గొంతు విన్నాక ఏదో తేడాగా ఉందే.. డబ్బింగ్ విషయంలో నాగ్ అశ్విన్ ఇలా ఎందుకు చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో దీపికా ఇలానే డబ్బింగ్ చెప్పిందంటూ పాత వీడియోల్ని షేర్ చేస్తున్నారు. దీపిక అక్షయ్ కుమార్ ‘హౌస్ ఫుల్’ మూవీలో తెలుగులో కొన్ని డైలాగ్స్ చెబుతోంది. ఆ వీడియోను ట్రోలింగ్‌కు వాడేస్తున్నారు.
వీటిపైనా నెట్టింట చర్చ..!
‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇందులోని రిచ్ విజువల్స్, మూవీ కాన్సెప్ట్, యాక్షన్ సీక్వెన్స్ ఇలా ప్రతీ దాని గురించి అంతా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా అమితాబ్ – ప్రభాస్ పాత్రలకు కనెక్షన్ ఏంటి? బుజ్జి – భైరవల కథ ఏంటి? దీపిక పదుకొణె, దిశా పటానీల పాత్రలు ఏంటి? కమల్ హాసన్ డిఫరెంట్ లుక్, రోల్ ఇలా ప్రతీ ఒక్క అంశం గురించి సోషల్ మీడియాలో చర్చలు జోరుగా జరుగుతున్నాయి. మొత్తంగా ట్రైలర్‌కు ఫుల్ మార్క్‌లు పడ్డాయి.