స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ బ్లాక్ శారీలో మైకం తెప్పిస్తోంది. నాజూకు నడుము, చిరునవ్వుతో కీర్తి మెస్మరైజ్ చేస్తోంది. మత్తెక్కించే చూపులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. తన హోమ్లీ అందాలతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను కీర్తి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా కీర్తి సురేష్ నటించిన ‘దసరా’ మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 30 పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
కీర్తి సురేశ్ కొద్ది నెలల క్రితం సన్నబడటంతో ఆమె అందం తగ్గిపోయిందంటూ కామెంట్లు వినిపించాయి. ఆమె నటించిన రంగ్‌దే చిత్రంలో స్పష్టంగా కనిపిస్తుంది.
దీంతో కీర్తికి ఆఫర్లు తగ్గిపోయాయి. ఈ క్రమంలో మళ్లీ తన పాత రూపు కోసం ప్రయత్నిస్తోంది ఈ అమ్మడు. సర్కారు వారి పాట చిత్రం నుంచి అదే పనిలో ఉంది.
వెంకీ అట్లూరీ పెళ్లి వేడుకకు హాజరైనప్పటి నుంచి కీర్తి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అందులో కలర్‌ఫుల్ డ్రెస్‌తో కనిపించింది. దీనిపై నెటిజన్లు విమర్శలు చేశారు.
అలాంటి వేడుకకు ఆ దుస్తులు వేసుకోవడమేంటని ప్రశ్నించారు. దుస్తుల విషయం ఎంతగా ట్రోల్ అయినా తన అందం గురించి మాత్రం పొగిడారు. అంతేకాదు, మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చిందంటూ కామెంట్లు వచ్చాయి.
గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లోనూ వరుసగా హాట్ ఫొటోస్‌తో హల్‌చల్ చేస్తోంది ఈ బ్యూటీ. తన అందం ఏ మాత్రం తగ్గలేదనే తరహాలో పిక్స్ పెడుతుండటంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. నూలు పోగుల వంటి డ్రెస్‌లో ఫ్యాన్స్‌కు కిక్కెచ్చింది కీర్తి. వాటికి చాలామంది ఫిదా అయ్యారు.
మాల్దీవ్స్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేసిన ఫొటోలు షేర్ చేసింది ఈ హీరోయిన్. స్మిమ్మింగ్ పూల్‌తో పాటు బీచ్ అందాలు చూస్తూ తన పరువాలను ప్రదర్శిస్తూ పిక్స్ పెట్టింది.
ఆ తర్వాత స్లీవ్ లెస్ టాప్‌లో మెరిసిపోయింది కీర్తి సురేశ్. ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె పిక్స్ సోషల్ మీడియాను ఊపేశాయి.
ఈ సుందరి ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇంటి వద్ద యోగా చేస్తూ ప్రకృతితో మమైకమవుతున్నాను.. తొలిసారి ఆసనం వేశానంటూ పెట్టిన వీడియో తెగ వైరల్ అయ్యింది.
ప్రస్తుతం దసరా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఆమె బ్లాక్ సారీలో పెట్టిన పిక్స్ యువతకు మత్తెక్కించాయి. ఈ సారీలోనే నానితో కలిసి ఇన్‌స్టా రీల్ చేసింది మెరుపు తీగ.
దసరా చిత్రంలోని చమ్కీలా అంగి ఏసి అనే పాటకు ఇద్దరూ చేసిన రీల్‌కు లైక్‌లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!