ఇంకా రెండు కొత్త జట్లు…
ఇది వరకు ఉన్న 8 జట్లకు తోడుగా రెండు కొత్త ఐపీఎల్ జట్లు వచ్చి చేరాయి. సంజయ్ గోయెంకాకు చెందిన లక్నో జట్టు, అహ్మదాబాద్ జట్టు కొత్త జట్లుగా బరిలోకి దిగుతున్నాయి. ఈ రెండు కొత్త జట్లకు ముగ్గురేసి ప్లేయర్ల చొప్పున సెలెక్ట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ కొత్త ప్రాంచైజీలు కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలను కెప్టెన్లుగా నియమించుకున్నాయి.
IPL జట్లివే…
- సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)
- రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (RCB)
- చెన్నై సూపర్‌కింగ్స్ (CSK)
- పంజాబ్ కింగ్స్ (PBKS)
- ముంబై ఇండియన్స్ (MI)
- రాజస్థాన్ రాయల్స్ (RR)
- ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
- కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)
- లక్నో సూపర్ జెయింట్స్
- అహ్మదాబాద్
రిటేయిన్ జాబితా…
ఈ ఏడు మెగా వేలం జరగనుంది. అందుకోసం ప్లేయర్లందరినీ ప్రాంచైజీలు తిరిగి వేలంలోకి ప్రవేశపెట్టాయి. ఒక్కో ప్రాంచైజీకి నలుగురేసి చొప్పున ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశాన్ని IPL పాలకమండలి కల్పించింది. కొన్ని జట్లు ముగ్గురిని రిటేయిన్ చేసుకోగా.. కొన్ని జట్లు నలుగురిని అట్టిపెట్టుకున్నాయి. 2021 ఐపీఎల్ ఆడిన పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు మాత్రమే తమ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఇయాన్ మోర్గాన్‌లను అట్టిపెట్టుకోలేదు. మిగతా అన్ని జట్లు తమ కెప్టెన్లను తిరిగి రిటైన్ చేసుకున్నాయి. 8 జట్ల రిటేయిన్ ఆటగాళ్ల జాబితా..
రాజస్థాన్ రాయల్స్..
- జాస్ బట్లర్
- సంజూ శాంసన్
- యశస్వి జైస్వాల్
కోల్‌కతా నైట్ రైడర్స్
- అండ్రీ రసెల్
- సునీల్ నరైన్
- వెంకటేశ్ అయ్యర్
- వరుణ్ చక్రవర్తి
ఢిల్లీ క్యాపిటల్స్
- అండ్రీ నోర్జే
- పృథ్విషా
- రిషభ్ పంత్
- అక్సర్ పటేల్
చెన్నై సూపర్ కింగ్స్
- మెయిన్ అలీ
- రవీంద్ర జడేజా
- రుతురాజ్ గైక్వాడ్
- ఎం.ఎస్ ధోని
సన్ రైజర్స్ హైదరాబాద్
- కేన్ విలియంసన్
- ఉమ్రన్ మాలిక్
- అబ్దుల్ సమద్
పంజాబ్ కింగ్స్
- మయాంక్ అగర్వాల్
- అర్షదీప్ సింగ్
ముంబై ఇండియన్స్
- కీరన్ పొలార్డ్
- రోహిత్ శర్మ
- జస్ప్రీత్ బుమ్రా
- సూర్య కుమార్ యాదవ్
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు
- గ్లెన్ మ్యాక్స్‌వెల్
- విరాట్ కోహ్లీ
- మహ్మద్ సిరాజ్
లక్నో సూపర్ జెయింట్స్, అహ్మదాాబాద్ జట్లు తమకు నచ్చిన ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాయి. లక్నో జట్టు కేఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ అప్పగించగా.. అహ్మదాబాద్ జట్టు హార్ధిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చింది. కెప్టెన్లు కాకుండా ఈ జట్లు ఇంకా ఇద్దరు ప్లేయర్లని సెలెక్ట్ చేసుకున్నాయి.
లక్నో
- మార్కస్ స్టాయినిస్
- కేఎల్. రాహుల్
- రవి బిష్ణోయ్
అహ్మదాబాద్
- రషీద్ ఖాన్
- హార్ధిక్ పాండ్యా
- శుభ్‌మన్ గిల్
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్టేట్స్…
ఇది ఐపీఎల్ 15వ ఎడిషన్. మొత్తం రిజిస్టర్ చేసుకున్న 590 మంది ఆటగాళ్లలో 228 మంది క్యాప్‌డ్ ప్లేయర్స్, 355 మంది అన్ క్యాప్‌డ్ ప్లేయర్స్. ఏడుగురు అసోసియేట్ దేశాలకు చెందినవారు. రూ. 2 కోట్లు అత్యధిక ధర. తర్వాత వేలంలో ఎంత ధరైనా వారికి రావొచ్చు. 590 మంది ఆటగాళ్లలో మొత్తం 48 మంది ఆటగాళ్లకు రూ. 2 కోట్ల ధర ఉంది. 20 మంది ఆటగాళ్లు రూ. 1.5 కోట్ల బేస్ ప్రైస్‌తో, 34 మంది ఆటగాళ్లు రూ. కోటి రూపాయల బేస్ ప్రైస్‌తో వేలంలో అందుబాటులో ఉండనున్నారు. ఈ 590 మందిలో 370 మంది ఇండియన్ ప్లేయర్లు కాగా.. 220 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు.
ఏ జట్టు వద్ద ఎన్ని కోట్లున్నాయంటే…
రిటేయిన్ చేసుకున్న ఆటగాళ్లను చెల్లించిన మొత్తం పోను ఐపీఎల్ జట్ల పర్సులో కొంత అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ ప్రకారమే వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఏ జట్టు వద్ద ఎంత ఉందంటే…
జట్టు | పర్సులో ఉన్న అమౌంట్ | ప్లేయర్లను తీసుకునేందుకు ఖాళీలు | ఓవర్సీస్ ప్లేయర్ల ఖాళీలు |
చెన్నై సూపర్‌కింగ్స్ | రూ. 48 కోట్లు | 21 | 7 |
ఢిల్లీ క్యాపిటల్స్ | రూ. 47.5 కోట్లు | 21 | 7 |
కోల్‌కతా నైట్ రైడర్స్ | రూ. 48 కోట్లు | 21 | 6 |
లక్నో సూపర్ జెయింట్స్ | రూ. 59 కోట్లు | 22 | 7 |
ముంబై ఇండియన్స్ | రూ. 48 కోట్లు | 21 | 7 |
పంజాబ్ కింగ్స్ | రూ. 72 కోట్లు | 23 | 8 |
రాజస్థాన్ రాయల్స్ | రూ. 62 కోట్లు | 22 | 7 |
సన్ రైజర్స్ | రూ. 68 కోట్లు | 22 | 7 |
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు | రూ. 57 కోట్లు | 22 | 7 |
అహ్మదాబాద్ | రూ. 52 కోట్లు | 22 | 7 |
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్