మహేష్‌బాబు (Mahesh Babu), డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). అయితే ఈ సినిమాలోని ‘కుర్చీని మడత పెట్టి’ పాట గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది.
అధిక సంఖ్యలో యువత ఈ సాంగ్ (Kurchi Madatha petti)కు తమదైన శైలిలో సెప్పులు వేసి రీల్స్ చేస్తున్నారు. వాటిని తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఈ క్రమంలోనే ‘కుర్చీని మడత పెట్టి’ (#KurchiMadathapetti) సాంగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు సృష్టించింది. ఈ సాంగ్‌పై ఇప్పటివరకు వచ్చిన రీల్స్ 1 మిలియన్ (1 Million+ Reels) మార్క్ దాటినట్లు ‘గుంటూరు కారం’ మేకర్స్ తెలిపారు.
నెటిజన్ల చేసిన రీల్స్‌ను అన్నింటిని చూపిస్తూ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ వారు తాజాగా ఓ ఆసక్తికర పోస్టును ట్విటర్‌లో షేర్ చేశారు. దీంతో #KurchiMadathapetti సాంగ్ నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది.
గుంటూరు కారం మేకర్స్ చేసిన పోస్టును మ్యూజిక్ డైరెక్టర్ థమన్ షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్ చేశాడు. ‘మడతపెట్టిఫైయింగ్ రికార్డ్స్ ఆల్ ఓవర్’ అంటూ పోస్టు ట్యాగ్ ఇచ్చారు. ప్రస్తుతం థమన్ పోస్టును ఫ్యాన్స్ షేర్ చేస్తూ ట్రెంగిండ్ చేస్తున్నారు.
అంతకుముందు కూడా థమన్ మరో ఆసక్తిక పోస్టును ఎక్స్ (ట్విటర్)లో పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘ఇది చాలా కాలంగా ట్రెండ్ అవుతోంది’ అనే ట్యాగ్‌తో ‘కుర్చీని మడత పెట్టి’ సాంగ్‌పై వచ్చిన రీల్స్‌ను పోస్టు చేశాడు.
#KurchiMadathapetti హ్యాష్‌టాగ్ ట్రెండింగ్‌లోకి రావడంతో ఈ పాటపై ప్రముఖులు చేసిన రీల్స్ కూడా మరోమారు ట్రెండ్ అవుతున్నాయి. బిగ్‌బాస్ ఫేమ్ యావర్, నయని పావని కలిసి చేసిన ‘కుర్చీని మడత పెట్టి’ సాంగ్ రీల్ నెట్టింట వైరల్ అవుతోంది.
అలాగే #KurchiMadathapetti సాంగ్‌పై పలువురు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు చేసిన వీడియోలు సైతం ట్విటర్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి. రెడ్ శారీలో హుషారెత్తించే స్టెప్పులతో నలుగురు యువతులు వేర్వేరు రీల్స్ ఆకట్టుకుంటున్నాయి.
విదేశాల్లోనూ ఈ కుర్చీని మడత పెట్టి సాంగ్ హవా కొనసాగుతోంది. ముగ్గురు యువతులు మంచులో ఈ పాటకు డ్యాన్స్ చేసి అదరగొట్టారు. దానికి సంబంధించిన రీల్ కూడా #KurchiMadathapetti హ్యాష్ ట్యాగ్‌తో వైరల్ అవుతోంది.
పలువురు డ్యాన్సర్లు కూడా కుర్చీని మడత పెట్టి పాటపై డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా ఇద్దరు యువతులు తమదైన స్టెప్పులతో ఈ పాటకు ఇరగదీశారు. వారు పర్‌ఫార్మెన్స్ ఎలా ఉందో చూడండి.
ఒకేసారి ఆరుగురు యువతులు చేసిన రీల్ కూడా ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. వారి డ్యాన్స్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్