మనం ఎంత కష్టపడినా అవగింజంతైన అదృష్టం ఉండాలని పెద్దలు చెబుతారు. ఆ అదృష్టం ఎప్పుడు..ఎలా.. ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలీదు. కాని అదృష్టవంతులైనాక మాత్రం అందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం అలాంటి అదృష్టమే ఓ ఇటుకల బట్టీ వ్యాపారిని వరించింది. ఇంతకీ అసలు కథేంటో ఓసారి లుక్కేయండి.
అనుకోకుండా అదృష్టం
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పన్నా పట్టణంలోని కిశోరిగంజ్ అనే ప్రాంతంలో సుశీల్ శుక్లా అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇటుకల బట్టీ వ్యాపారం చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఓ పాత గనిని లీజుకి తీసుకొని ఇటుకల తయారీకి మట్టిని తరలించడంతో పాటు వజ్రాల మైనింగ్ కూడ చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే అనుకోకుండా తవ్వకాల్లో ఓ మెరుస్తున్న రాయి బయటపడింది. దానిని విలువైన వజ్రంగా గుర్తించిన సుశీల్ శుక్లా జిల్లా మైనింగ్ అధికారులకు సమాచారం అందించాడు.
చిన్న వజ్రంతో కోటీశ్వరుడయ్యాడు
వజ్రం 22.11 క్యారెట్లు ఉన్నట్లు జిల్లా డైమండ్ అధికారి రవి పాటిల్ గుర్తించాడు. మార్కెట్లో ఈ వజ్రం విలువ రూ.1.20 కోట్లు ఉంటుందని గుర్తించారు. దీంతో శుక్లా ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశాడు. దాదాపు 20 ఏళ్లుగా ఇదే వ్యాపారంలో కొనసాగినప్పటికీ ఇంత విలువైన వజ్రం ఎప్పుడూ దొరకలేదని పేర్కొన్నాడు. ఈ వజ్రాన్ని అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతో వ్యాపారాన్ని విస్తరించుకుంటానని ఆనందం వ్యక్తం చేశాడు. త్వరలోనే ఈ వజ్రాన్ని వేలం నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. వేలంలో ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించి మిగతా మొత్తాన్ని శుక్లాకి అందజేస్తామని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కి ఫన్నా జిల్లా 380 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న గనులల్లో తరచూ చిన్న చిన్న వజ్రాలు లభిస్తుంటాయని అధికారులు పేర్కొన్నారు. ఇంత విలువైన వజ్రం ఈ మధ్యకాలంలో బయల్పడలేదని పేర్కొన్నాడు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది