చిరుతో జోడీ కట్టేనా?
మాళవిక మోహనన్ తెలుగులో ఇంత వరకూ ఒక్క స్ట్రెయిట్ మూవీ కూడా చేయలేదు. కానీ అమ్మడు మాత్రం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రజనీకాంత్ పేట్టా, దళపతి విజయ్ మాస్టర్ సినిమాలతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. యంగ్ డైరెక్టర్ భీష్మ, ఛలో వంటి సినిమాల హిట్లతో జోష్ మీదున్న వెంకీకుడుముల మెగాస్టార్ కోసం ఓ కథను సిద్ధం చేశారు. ఈ కథకు మెగాస్టార్ చిరంజీవి కూడా ఓకే చెప్పారు. ఇక ఈ సినిమాలో ఈ బోల్డ్ బ్యూటీని తీసుకోవాలని మూవీ టీం భావిస్తోందట. మరి ఈ వార్తలు నిజమవుతాయో? లేదో వేచిచూడాలి.
కేరళలో పుట్టినా..
కేరళలో జన్మించిన మాళవిక కేవలం మల్లూవుడ్‌లోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ్ సినిమాలను కూడా చేసింది. ఇంత వరకూ ఈ చిన్నది తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయలేదు. ఇప్పుడు మెగాస్టార్ సరసన ఓకే అయితే త్వరలోనే ఈ బ్యూటీని తెలుగు స్ట్రెయిట్ సినిమాలో మనం చూడొచ్చు.
మాల్దీవుల్లో రచ్చ..
మాళవిక మోహనన్ మాల్దీవ్స్‌లో రచ్చ చేస్తుంది. బికినీ వేసుకుని ఈ బ్యూటీ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మాళవిక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!