మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన ఓ ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. భోపాల్‌లో బబ్బూ, ఆశ ఠాకూర్ అనే వ్యక్తులు సహజీవనం చేస్తున్నారు. కానీ గత కొన్ని రోజులుగా ఆశ, శివదత్ అనే వ్యక్తితో చనువుగా ఉంటోంది. దీంతో కోపం పెంచుకున్న బబ్బూ.. శివదత్ పేరు చెప్పి ప్రతి రోజు ఆశను వేధించేవాడు. చివరకు ఒక రోజు శివదత్ ను చంపాలని నిర్ణయించుకున్నాడు. దీనికి ఆశ సాయం అడిగాడు. చేసేదేం లేక ఆమె ఒప్పుకుంది. పార్టీ ఉందని శివను ఇంటికి పిలిచిన బబ్బూ అతడితో కలిసి మద్యం సేవించాడు. అతడు ఫుల్లుగా తాగిన తర్వాత కత్తితో పొడిచి చంపాడు. తర్వాత తన లవర్ ఆశ సాయంతో కలిసి శివను ఉప్పు వేసి గోతిలో పాతి పెట్టాడు. కానీ కొన్ని రోజుల తర్వాత పక్కింటివాళ్లతో జరిగిన గొడవ సందర్భంగా బబ్బూ నాతో పెట్టుకుంటే శివకు పట్టిన గతే పడుతుందని అతడి పుర్రెతో బెదిరించాడు. బెదిరిపోయిన పక్కింటి మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు అతడి శవాన్ని వెలికి తీసి ఆశ, బబ్బూను అరెస్ట్ చేశారు.
ప్రేయసితో చనువుగా ఉంటున్నాడని చంపేశాడు..
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్