• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Mokshagna Teja: అఖండ సీక్వెల్‌లో మోక్షజ్ఞ, పవర్‌ ఫుల్ రోల్ రాసిన బోయపాటి?

  నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం ఫ్యాన్స్‌ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో తనయుడ్ని తెరపై చూడాలని ఆరాటపడుపతున్నారు. మోక్షజ్ఞ తెరంగేట్రం విషయాన్ని ఈ మధ్య బాలయ్య సైతం కన్ఫార్మ్‌ చేయడంతో ఫ్యాన్స్‌లో జోష్‌ పెరిగింది. రీసెంట్‌గా మోక్షజ్ఞ స్టైలిష్‌, హ్యాండ్సమ్ ఫొటోలు బయటకురాగా తమ అప్‌కమింగ్‌ హీరో మేకోవర్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి తాజాగా ఓ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఇది విన్న నందమూరి అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు. 

  బాలయ్య సినిమాతో ఎంట్రీ?

  నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. వీరి కాంబోలో గతంలో వచ్చి బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘అఖండ’ (Akhanda) సినిమాకు సీక్వెల్‌గా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ‘అఖండ 2’ సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఇందులో మోక్షజ్ఞ ఓ స్పెషల్‌ రోల్‌ చేయనున్నాడు. మోక్షజ్ఞ కోసం దర్శకుడు బోయపాటి ఓ రోల్‌ రాశారని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. సెకండాఫ్‌లో అతడి ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞపై టెస్ట్‌ షూట్‌ కూడా నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే తన తండ్రి బాలయ్య సినిమాతోనే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేసే అవకాశముంది. దీంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. 

  హనుమాన్‌ దర్శకుడితో!

  మరోవైపు హీరోగా మోక్షజ్ఞ ఫస్ట్‌ ఫిల్మ్‌ కోసం నందమూరి అభిమానులతో పాటు సగటు సినీ లవర్స్‌ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘హనుమాన్‌’ (Hanuman) ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా లాక్‌ అయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్‌ కూడా ఫైనల్‌ అయ్యిందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అన్ని కుదిరితే ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇక ప్రశాంత్‌ వర్మ, బాలయ్య మధ్య ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. ఆహాలో బాలయ్య చేసిన అన్‌స్టాపబుల్‌ షోకు దర్శకత్వ బాధ్యతలను ప్రశాంత్ వర్మనే నిర్వహించారు. అలా ఆయనతో ప్రశాంత్‌ వర్మకు మంచి బాండింగ్‌ ఏర్పడింది. ఆ రిలేషన్‌తోనే బాలయ్య తన కొడుకు బాధ్యతలను ప్రశాంత్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.

  హ్యాండ్సమ్‌ లుక్‌లో..

  నందమూరి మోక్షజ్ఞ తన రూపురేఖలను పూర్తిగా మార్చుకున్నాడు. హ్యాండ్సమ్ లుక్‌లోకి మారిపోయాడు. హీరో కటౌట్‌తో ఉన్న మోక్షజ్ఞ ఫొటోలు ఇటీవల నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఇందులో క్రేజీ లుక్స్‌తో మోక్షజ్ఞ మెస్మరైజ్‌ చేశాడు. ఎవరూ ఊహించని విధంగా పూర్తి ఫిట్‌గా కనిపించి ఆశ్చర్యపరిచాడు. తాను పక్కా స్టార్‌ హీరో మెటీరియల్‌ అని తన న్యూ లుక్‌ ఫొటోలతో చాటిచెప్పాడు. ఇక మోక్షజ్ఞ లేటేస్ట్‌ చిత్రాలను చూసి నందమూరి ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అయ్యారు. బాలకృష్ణ తనయుడు ఎలా ఉండాలని తాము ఊహించుకున్నామో మోక్షజ్ఞ అలాగే మేకోవర్‌ అయినట్లు కామెంట్స్ చేశారు. మరో నందమూరి వారసుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు సమయం ఆసన్నమైందంటూ పోస్టులు పెట్టారు. 

  29 ఏళ్లకు తెరంగేట్రం!

  తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబంగా నందమూరి వంశం ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన జూ.ఎన్టీఆర్‌.. టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించాడు. తారక్‌ 17 ఏళ్లకే ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. అయితే ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 29 ఏళ్లు. తెలుగులో ఇంత లేటు వయసులో నట వారసుడిగా ఎంట్రీ ఇవ్వనున్న హీరో మోక్షజ్ఞనే కానున్నాడు. నిజానికి బాలకృష్ణ తన కుమారుడిని హీరో చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే శరీరాకృతి మార్చుకునే క్రమంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యమైంది. ఇన్నాళ్లకు హీరో మెటిరియల్‌గా మోక్షజ్ఞ లుక్‌ మారడం.. అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv