6. జాతిరత్నాలు
జాతిరత్నాలు సినిమా.. లాజిక్ లేకుండా జస్ట్ చూసి ఎంజాయ్ చేసి నవ్వుకునే సినిమాగా తెరకెక్కించారు. అందుకే ఒక మంత్రి వంటచేసే చెఫ్‌తో ఏదో మాట్లాడితే హాంగ్‌కాంగ్‌లో బిజినెస్ గురించి మాట్లాడడని, అక్కడ బ్లాక్‌మనీ దాచుకున్నాడని ఇలాంటి సీన్స్‌తో కామెడీ పండించారు. లోతుగా ఆలోచిస్తే ఎక్కడా లాజిక్ ఉండదు. కానీ జస్ట్ నవ్వించడానికి ప్రయత్నించారంతే.
7. చావుకబురు చల్లగా
ఈ సినిమాలో కొన్ని సీన్లు ప్రేక్షకులకు అసలు రుచించవు. భర్త చనిపోయి బాధలో ఉన్న హీరోయిన్‌ను..శవాన్ని తీసుకెళ్లే వాహన డ్రైవర్ ఆమెను చూసి ప్రేమలోపడటం..ఆమె వెంట ప్రేమిస్తున్నానని తిరగడం అసలు ఎక్కడా లాజిక్ కనిపించదు. ఇక హీరో వాళ్ల అమ్మ ఆమని..తనకంటే వయసులో పెద్దవాడైన భర్తను పెళ్లిచేసుకొని అతడు బతికి ఉండగానే.. మళ్లీ ప్రేమించిన వాడితో వెళ్లడం దాన్ని హీరో కూడా యాక్సెప్ట్ చేయడం ఎక్కడా సామాన్య ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండదు.
8. మోసగాళ్లు
మెసగాళ్లు సినిమా హాలీవుడ్ డైరెక్టర్‌తో తీశామని చెప్పినప్పటికీ ఒక్కసీన్‌లో కూడా లాజిక్ ఉండదు. ఒక సీన్‌లో అయితే అక్కాతమ్ముళ్లు విష్ణు, కాజల్ మాట్లాడుకుంటుంటే అనవసరమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో రోత పుట్టించారు. ఒకరి డైలాగ్ తర్వాత గ్యాప్‌లో మ్యూజిక్ వచ్చి పాత సినిమాల్లోలాగా..స్లో మోషన్‌లో చుట్టూ తిరుగుతూ మాట్లాడుకుంటారు. అసలు ఆ సీన్ అలా ఎందుకు తీశారో ఇప్పటికీ అర్థం కాదు. ఇక మోసగాళ్లను పట్టుకోవడానికి వస్తున్నామని పోలీస్ లైవ్ పెట్టడం, అది చూసి వాళ్లు పారిపోవడం ..ఈ సీన్స్ చూసి తలలు పట్టుకున్నారు ప్రేక్షకులు.
9. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
సినిమాలో సెకండాఫ్‌లో అఖిల్ వచ్చి పూజా హెగ్డే చుట్టూ తిరుగుతుంటాడు. ఓలా బైక్ అని పిలవగానే వచ్చి ఆమెను తీసుకెళ్తాడు. ఆమె వెంటే ఉండి ఆమెను రక్షిస్తుంటాడు. అయినా హీరోయిన్.. హీరో మొహం చూడదు. ఆమెతో మాట్లాడుతుంటాడు. కానీ వాయిస్ గుర్తుపట్టదు ఏంటో మరి. బొమ్మరిల్లు భాస్కర్ ఈ లాజిక్ ఎవరికీ అర్థం కాలేదు.
10. శ్యామ్ సింగరాయ్
శ్యామ్ సింగరాయ్ సినిమాలో 1970ల నాటి బెంగాల్‌లో ఉన్న దేవదాసీల వ్యవస్థ గురించి చూపించారు. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. పునర్జన్మల కాన్సెప్ట్‌లో ఈ సినిమా తెరకెక్కింది. శ్యామ్ సింగరాయ్ మరణించి వాసుదేవ్‌ల మళ్లీ పుడతాడు. చివరికి రోజీని వెళ్లి కలుసుకుంటాడు. ఆమె ఆ సీన్‌లో వృద్ధురాలుగా కనిపిస్తుంది. అప్పటివరకు శ్యామ్ సింగరాయ్ కోసం ఎదురుచూసి ఆయన చేతుల్లో చనిపోతుంది. పునర్జన్మల కాన్సెప్టులో లాజిక్ ఉండదు. కేవలం మ్యాజిక్ మాత్రమే. కేవలం సినిమాను సినిమాలాగే చూస్తే ఎలాంటి గందరగోళం ఉండదు.
పార్ట్-1 చదివేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి. https://telugu.yousay.tv/most-embarrassing-scenes-in-tollywood-films-2021.html
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!