ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) ఒకటి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు మహేశ్‌బాబు (Mahesh babu) డబ్బింగ్ చెప్పి అదరగొట్టాడు. సింహానికి మహేష్ సూపర్బ్‌గా డబ్బింగ్ చెప్పారంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉంది? అందులో మహేష్ చెప్పిన డైలాగ్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం.
మహేష్ వాయిసే హైలేట్
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) తెలుగు ట్రైలర్‌ను నిర్మాణ సంస్థ డిస్నీ సోమవారం (ఆగస్టు 26) విడుదల చేసింది. నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల కథ అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. పుట్టుకతోనే అన్నదమ్ములు కాకపోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువబడిన టాకాల కథ ఇది అంటూ కథలోకి వెళ్లారు. ఆ తర్వాత బాల్యంలో ముఫాసా, టాకాల మధ్య అనుబంధాన్ని, స్నేహాన్ని చూపించారు. ‘అప్పుడప్పుడు ఈ చల్లని గాలి, నా ఇంటి నుంచి జ్ఞాపకాల్ని గుర్తుచేస్తున్నట్లు అనిపిస్తుంది’ అంటూ మహేష్‌బాబు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ‘మనం ఒక్కటిగా పోరాడాలి, నేను ఉండగా నీకు ఏం కాదు టాకా, భయపడకు’ అంటూ మహేష్ బాబు చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ‘ఇందాకా ఏదో అన్నావే’ అంటూ చివరలో తన కామెడీ టైమింగ్‌తో అలరించాడు మహేష్. ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మహేష్ వాయిస్ కోసమైనా సినిమాను థియేటర్లలో చూస్తామంటూ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
‘ఇది నాకెంతో ప్రత్యేకం’
ముఫాసా తెలుగు ట్రైలర్‌ను మహేష్ తన ఎక్స్ ఖాతాలో స్వయంగా పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రకు కొత్త అంకం. తెలుగులో ముఫాసాకు వాయిస్‌ని అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. అంతకుముందు కూడా డబ్బింగ్ చెప్పడంపై మహేష్ మాట్లాడారు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తాను. డిసెంబర్ 20న ముఫాసాను నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు.
తెలుగులో మహేష్.. హిందీలో షారుక్
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్ ట్రైలర్ సైతం ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abram) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్ ఖాన్, సింబా పాత్రకు షారుక్ పెద్ద తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) వాయిస్ ఇవ్వడం విశేషం. ఈ సినిమా గురించి షారుక్ మాట్లాడుతూ ‘ముఫాసాకు అద్భుతమైన వారసత్వం ఉంది. అడవికి అతడే రారాజుగా నిలుస్తాడు. ఒక తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు చేరువైంది. బాల్యం నుంచి రాజుగా ఎదగడం వరకూ ముఫాసా జీవితం ఎలా సాగిందనే విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. 2019లో వచ్చిన ది లయన్ కింగ్ తర్వాత మరోసారి ఈ పాత్ర కోసం వర్క్ చేయడం ప్రత్యేకంగా ఉంది. మరీ ముఖ్యంగా నా పిల్లలతో కలిసి వర్క్ చేయడం ఆనందంగా అనిపిస్తోంది’ అని అన్నారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.
మహేష్‌కు డబ్బింగ్ కొత్త కాదు.. కానీ!
ముఫాస పాత్రకు డబ్బింగ్ చెప్పడం మహేష్ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్ కల్యాణ్ నటించిన ‘జల్సా’, తారక్ హీరోగా చేసిన ‘బాద్షా’ చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్ తన వాయిస్‌ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో మహేష్ వాయిస్ ఇచ్చారు. అయితే మహేష్ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్‌తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్ ఆకట్టుకుంటారో చూడాలి.
‘SSMB29’తో బిజీ బిజీ
దర్శక ధీరుడు రాజమౌళితో ఓ అడ్వెంచరస్ యాక్షన్ మూవీని మహేష్ చేయబోతున్నాడు. ఇందులో మహేష్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇందుకోసం లాంగ్ హెయిర్, గడ్డంతో మహేష్ మేకోవర్ అవుతున్నాడు. త్వరలోనే మహేష్‌బాబు, రాజమౌళి మూవీ ఆఫీషియల్‌గా లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నట్లు సమాచారం.
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!