టాలీవుడ్‌లో క్లాసిక్ సినిమాలు నిర్మిస్తూ దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్లకు ఆయన కేరాఫ్‌గా మారారు. మరోవైపు నేచురల్ స్టార్ నానికి సైతం లవర్ బాయ్‌గా మంచి ఇమేజ్ ఉంది. ఇటీవల ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) సినిమాతో సాలిడ్ విజయాన్ని సైతం అందుకొని మంచి ఊపులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో హీరో నాని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఓ చిత్రం రాబోతున్నట్లు నెట్టింట విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి కూడా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
సూపర్ కాంబో లోడింగ్
టాలీవుడ్‌లో మరో ఇంట్రస్టింగ్ కాంబినేషన్‌కి రంగం సిద్ధం అవుతోంది. నాని-శేఖర్ కమ్ముల కాంబోలో ఓ సినిమా రానున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అటు టాలీవుడ్ వర్గాలు సైతం నాని, శేఖర్ కమ్ముల కలిసి ఓ సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నాయి. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యిందని త్వరలోనే నానికి కథ వినిపించే అవకాశముందని తెలుస్తోంది. ఈ చిత్రం సరికొత్త లవ్ ఎంటర్‌టైనర్‌గా రానున్నట్లు సమాచారం. కాబట్టి సాయిపల్లవిని హీరోయిన్‌గా తీసుకుంటే బాగుటుందని శేఖర్ కమ్ముల భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు.
సహజ శైలికి భిన్నంగా..
శేఖర్ కమ్ముల ఒక సినిమాకు పనిచేస్తున్నప్పుడు మరో సినిమా గురించి అస్సలు ఆలోచించరు. ఆయన పూర్తి ఫోకస్ మెుత్తం ప్రస్తుత మూవీ పైనే ఉంటుంది. అయితే ఈ పంథాకు ఆయన స్వస్థి పలికినట్లు కనిపిస్తోంది. ఒక సినిమా చేస్తున్నప్పుడే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన కథలు సైతం ఆయన సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తద్వారా సినిమా పూర్తయిన వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులు మెుదలుపెట్టవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. దాని వల్ల సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ తగ్గుతుందని ఈ క్లాసిక్ డైరెక్టర్ అంచనావేస్తున్నారట. ఈ క్రమంలోనే నాని చిత్రానికి సంబంధించిన స్టోరీని ఆయన సిద్ధం చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన తమిళ హీరో ధనుష్, తెలుగు దిగ్గజ నటుడు నాగార్జున కాంబోలో కలిసి ‘కుబేర’ (Kubera) అనే పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇదే తొలిసారి
నాని – శేఖర్ కమ్ముల కాంబోలో ఇప్పటివరకూ ఒక్క సినిమా తెరకెక్కలేదు. నానితో వర్క్ చేయాలని ఉందని పలు సందర్భాల్లో శేఖర్ కమ్ముల వ్యాఖ్యానించడం విశేషం. అయితే సాయిపల్లవితో మాత్రం రెండు చిత్రాలకు శేఖర్ కమ్ముల పనిచేశారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా సినిమాతోనే సాయిపల్లవి హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత నాగచైతన్యతో తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’ చిత్రంలోనూ ఆమెనే కథానాయికగా ఎంచుకున్నారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు నటిగా సాయిపల్లవికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. మరోవైపు సాయి పల్లవి, నాని కూడా ఇప్పటికే రెండు చిత్రాలకు వర్క్ చేశారు. ‘MCA’ (మిడిల్ క్లాస్ అబ్బాయి), ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాల్లో వారిద్దరు జంటగా నటించారు. ఆ రెండు చిత్రాలు కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో వీరి కాంబోలో హ్యాట్రిక్ విజయం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఇప్పట్లో కష్టమేనా!
‘సరిపోదా శనివారం’ చిత్రం తర్వాత ప్రస్తుతం నాని ‘హిట్ 3’ (Hit 3)కోసం రెడీ అవుతున్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజై ఆకట్టుకుంది. అలాగే సుజిత్ డైరెక్షన్‌లో ఒక సినిమా, దసరా డైరెక్టర్‌తో మరో మూవీని నాని ప్లాన్ చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఈ అరుదైన కాంబో సెట్ కావాడానికి మరో రెండేళ్ల సమయం పట్టొచ్చని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల కూడా ‘కుబేర’ చిత్రం షూటింగ్‌తో బిజీ బిజీగా ఉండటం గమనార్హం.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?