కొత్త ఏడాదిలో ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్ చేసేందుకు తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఈ సంక్రాంతి (Sankranthi)కి విడుదలైన ‘హనుమాన్’ (Hanuman), ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), ‘సైంధవ్’ (Saindhav), ‘నా సామిరంగ’ (Na Sami Ranga) చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ కోవలోనే మరికొన్ని సినిమాలు అలరించేందుకు రాబోతున్నాయి. కాగా, ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు సంక్రాంతి సందర్భంగా రిలీజై ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈగల్
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్ చిత్రం ‘ఈగల్ (Eagle). వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాలి. కొన్ని కారణాల నేపథ్యంలో ‘ఫిబ్రవరి 9’కి వాయిదా పడింది. అయితే ఈ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను మేకర్స్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో రవితేజ, హీరోయిన్ కావ్యా థాపర్ ఎంతో అందంగా కనిపించారు.
రాజా సాబ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర టైటిల్‌ను సంక్రాంతి సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ‘రాజా సాబ్’ (Raja Saab)గా పేరును ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా అది ట్రెండింగ్‌గా మారింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ లుంగీతో కనిపించడం విశేషం.
ఆపరేషన్ వాలెంటైన్
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine) చిత్రంలో నటిస్తున్నాడు. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో చేస్తోంది. ఈ చిత్ర యూనిట్ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అమృత్‌సర్‌లోని చారిత్రక వాఘా సరిహద్దులో వందేమాతరం పాటను కూడా లాంచ్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.
భీమా
ప్రముఖ హీరో గోపిచంద్ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భీమా (Bheema). పండగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ సైతం హల్‌చల్ చేసింది. ఇందులో గోపిచంద్ ఎద్దుపై కూర్చొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ. హర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలవుతుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విశ్వక్ సేన్ హీరోగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari). ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ మార్చి 8న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
వెట్టైయాన్
జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘వెట్టియాన్’. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ సంక్రాంతి రోజున విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పోస్టర్ వింటేజ్ రజనీకాంత్‌ను గుర్తుకు తెచ్చింది.
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్‌టైమ్ (The Greatest of All Time). ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ కూడా తాజాగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్‌లో విజయ్‌తో పాటు ప్రభుదేవ, ప్రశాంత్, వెంకట్ ప్రభు కనిపించారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం అందిస్తున్నాడు.
కెప్టెన్ మిల్లర్
తమిళ హీరో ధనుష్ నటించిన లెటేస్ట్ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller). ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో జనవరి 25న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని లేటెస్ట్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీని అరుణ్ మతేశ్వరణ్ డైరెక్ట్ చేశారు.
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు
యంగ్ హీరో సుహాస్, డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో రూపొందుతున్న ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ పండగ సందర్భంగా రిలీజై ఆకట్టుకుంది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్