దసరా పండగను పురస్కరించుకొని గతవారం పెద్ద హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించి ఆనందంలో ముంచెత్తాయి. ఇక ఈ వారం బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
లవ్‌రెడ్డి
అంజన్ రామచంద్ర, శ్రావణిరెడ్డి కీలక పాత్రల్లో స్మరన్‌రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌రెడ్డి’ (Love Reddy Movie). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 18న విడుదల కానుంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా దీనిని తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది.
సముద్రుడు
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్‌లుగా నగేశ్ నారదాసి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సముద్రుడు’ (Samudrudu). అక్టోబరు 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వీక్షణం
రామ్ కార్తీక్ (Ram Karthik), కశ్వి (Kashvi) జంటగా చేసిన తాజా చిత్రం ‘వీక్షణం’ (Veekshanam). మనోజ్ పల్లేటి దర్శకుడు. పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ అక్టోబరు 18న థియేటర్‌లో విడుదల కానుంది. చనిపోయిన అమ్మాయితో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు.
రివైండ్
సాయి రోనక్ హీరోగా కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘రివైండ్’ (Rewind Movie). అమృత చౌదరి కథానాయిక. ఈ మూవీ అక్టోబరు 18న విడుదల కానుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కు మనసుకు హత్తుకునే లవ్‌స్టోరీని జోడించి ఈ సినిమా తీసినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పక నచ్చుతుందని అభిప్రాయపడ్డారు.
‘ఖడ్గం’ రీ-రిలీజ్
శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఖడ్గం’. 2002లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అక్టోబరు 18న (khadgam re release date) ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
1000 బేబీస్
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ‘1000 బేబీస్ (1000 Babies). అక్టోబర్ 18న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు. ఇందులో రెహమాన్, నీనా గుప్తా ముఖ్యపాత్రలు పోషించారు. నజీమ్ దర్శకత్వం వహించారు.
కలి
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ‘కలి‘ (Kali Movie OTT Release) చిత్రం ఈ వారం ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 17నుంచి ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రిన్స్, నరేశ్ అగస్త్య ముఖ్య పాత్రలు పోషించారు. నేహా కృష్ణన్ హీరోయిన్‌గా చేసింది. శివ శేషు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 4న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
Title | Category | Language | Platform | Release Date |
The Linkan Lawyer | Movie | English | Netflix | Oct 17 |
Fabulous Lives vs Bollywood Wives S3 | Series | English | Netflix | Oct 19 |
The Pradeeps Of Pittsburgh | Series | English | Amazon | Oct 17 |
Citadel Honey Bunny | Series | Telugu/Hindi | Amazon | Nov 7 |
Kali | Movie | Telugu | ETV Win | Oct 17 |
Reeta Sanyal | Movie | Hindi | Hotstar | Oct 14 |
Nemesis | Movie | English/Dutch | Hotstar | Oct 16 |
1000 Babies | Series | Telugu/Malayalam | Hotstar | Oct 18 |
Rivals | Movie | English | Hotstar | Oct 18 |
Crime Reels | Movie | Telugu | Aha | Oct 13 |
Janaka Aithe Ganaka | Movie | Movie | Aha | Nov 5 |
Maa Nanna Super Hero | Movie | Movie | Zee 5 | Nov 8 |
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం