జియో మరో సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. రూ.599 కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా రోజూ 4జీ, 5జీ డెటాను అన్‌లిమిటెడ్‌గా పొందవచ్చు. అలాగే రోజుకు 100SMSలు ఉచితంగా లభిస్తాయి. జీయో టీవీ, జీయో సినిమా, జీయో క్లౌడ్ యాప్ సేవలను ఉచితంగా చూడవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 30రోజులు ఉంటుంది.
ప్రిపెయిడ్‌లో ఇలా అన్లిమిటెడ్ డేటాను జియో తీసుకురావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు జియో తీసుకొచ్చిన అన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా డేటా లిమిట్‌తో వచ్చినవే. ఈసారి ఐపీఎల్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న రిలయన్స్ సంస్థ.. మ్యాచ్‌లను ఉచితంగా జియో సినిమా యాప్‌లో ప్రసారం చేస్తోంది. అయితే సగటు జియో కస్టమర్ మ్యాచ్‌లను వీక్షించాలంటే ఇప్పుడున్న డేటా ప్లాన్స్ సరిపోవు. ఈ నేపథ్యంలోనే జియో అన్లిమిటెడ్ ప్లాన్‌తో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
జియో నయా ప్లాన్ రూ.599తో కస్టమర్లు అపరిమితమైన 4G డేటాతో పాటు అపరిమితమైన వాయిస్ కాల్ పొందవచ్చు. మరోవైపు ప్రీపెయిడ్ నుండి పోస్ట్‌పెయిడ్‌కు మారాలనుకొనే వారికి, ప్రీమియం సేవలను పొందాలనుకునే కస్టమర్లకు జియో ఈ ప్లాన్‌ను 30 రోజుల ఉచిత ట్రయల్‌ని కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ తో రోజుకు కేవలం రూ. 19 అతి తక్కువ ఖర్చుతో వినియోగదారులు బహుళ ప్రయోజనాలను పొందగలరు.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?