• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కనుబొమ్మలతోనూ ఎన్టీఆర్ నటిస్తాడు: జక్కన్న

    జూ.ఎన్టీఆర్‌పై దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. తన కనుబొమ్మలతోనూ నటించగల నటుడు ఎన్టీఆర్ అని జక్కన్న కొనియాడాడు. లాస్ ఏంజెల్స్‌లో RRR ప్రదర్శనలో ఎన్టీఆర్, రాజమౌళి పాల్గొన్నారు. ‘కొమురం భీముడో నాకు ఫేవరేట్ సాంగ్. ఇప్పటివరకు నేను తెరకెక్కించిన పాటల్లో ఆల్‌ టైం ఫేవరేట్ అంటే ఇదే. ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటించాడు. ఆయన కనుబొమ్మలపై కెమెరా పెడితే వాటితోనూ నటించగలడు’ అంటూ తారక్‌ని రాజమౌళి ప్రశంసించాడు. రాజమౌళి నుంచి ఎంతో నేర్చుకున్నానని ఈ సందర్భంగా తారక్ వెల్లడించాడు. ఈరోజు ఈ స్థాయిలో తాను ఉండటానికి దర్శకులే అని ఎన్టీఆర్ చెప్పాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv