ఎన్‌టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా RRR నేడు రిలీజైంది. ఈ సినిమాను ఎన్‌టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఏఎంబీ సినిమాస్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక షో చూశాడు. ఎన్‌టీఆర్ వెంట భార్య ప్రణతి, ఇద్దరు కుమారులు, ఎన్‌టీఆర్ తల్లి, కళ్యాణ్ రామ్, స్నేహితులు ఉన్నారు. సినిమా చూసి బయటకు వచ్చిన తారక్‌ను ఎలా ఉందని మీడియా అడిగింది. దానికి సమాధానంగా సూపర్ అంటూ రెండు చేతులతో థంబ్సప్ సింబల్ చూపించాడు. ఆయన మోహంలో చాలా సంతోషం కనిపిస్తుంది. ఎన్‌టీఆర్ రియాక్షన్ చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
ఎన్‌టీఆర్ ఈ సినిమాలో గోండు జాతికి చెందిన వ్యక్తిగా కొమరం భీమ్ పాత్రలో నటించాడు. ఇప్పటికే సినిమా చూసిన వాళ్లు ఎన్‌టీఆర్ ఎంట్రీ సీన్ ఒక రేంజ్‌లో ఉందని చెప్తున్నారు. ట్రైలర్‌లో చూపించిన పులితో ఫైట్ సీన్ అదరగొట్టినట్లు తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ కూడా పోలీస్ అధికారి పాత్రలో మెప్పించాడు. రామ్‌చరణ్, ఎన్‌టీఆర్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తమ హీరోలను ఇంత పవర్‌ఫుల్‌గా చూపించినందుకు రాజమౌళికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. బాహుబలి రికార్డులను బద్దలుకొట్టి మరో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్‌చేస్తుందని చెప్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!