పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆగిపోయిన తన సినిమాలను ఇటీవలే మెుదలు పెట్టారు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కల్యాణ్ త్వరలోనే ‘ఓజి’ (OG) మూవీ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అయితే పవన్ ప్రాజెక్ట్స్‌లో అన్నిటికంటే ‘ఓజీ’పైనే ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఆ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థమన్ ఏమన్నారంటే?
పవన్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’ చిత్రం రూపొందుతోంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా తాజాగా ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్లో ‘ఓజి అప్డేట్స్ గురించి అందరూ అడుగుతున్నారు. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్తో మనం త్వరలోనే కలుద్దాం’ అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్ మరింత జోష్ పెంచారు. థమన్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
పాన్ ఇండియా స్థాయిలో
పవన్ కల్యాణ్ ఓజీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండగా అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్థమన్ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్తో లింక్ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి. గతంలో వచ్చిన గ్లింప్స్ సైతం ఓజీ హైప్ క్రియేట్ చేసింది.
అప్డేట్స్కు కేరాఫ్‌గా థమన్!
సంగీత దర్శకుడు థమన్ తను పనిచేస్తున్న చిత్రాలకు సంబంధించి వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను తెగ ఖుషీ చేస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులకు తన వరుస అప్డేట్స్తో గ్రాండ్ ట్రీట్ ఇస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) చిత్రానికి కూడా థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆ మూవీకి సంబంధించి వరుసగా అప్డేట్స్ ఇస్తూ దాదాపు మూవీ రిలీజ్ డేట్‌ను సైతం కన్ఫార్మ్ చేశారు. ఇప్పుడు ‘ఓజీ’ అప్డేట్స్ కూడా ఇచ్చి మెగా ఫ్యాన్స్ మరింత ఇష్టుడిగా మారిపోయారు.
సమ్మర్లో గ్రాండ్ రిలీజ్
ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీతో పాటు ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌లోనూ జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu Release Date) రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్