భారత వైమానిక దళం నేపథ్యంలో మెగాహీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలంటైన్’ (Operation Valentine). గతంలో పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజైంది. ఈ సినిమాకు సంబంధించి గురువారం సాయంత్రమే ప్రీమియర్లు పడగా పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. రిలీజ్ రోజునే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ కావడం విశేషం.
నెల రోజుల్లో ఓటీటీలోకి!
‘ఆపరేషన్ వాలంటైన్’ సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల డీల్ మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు సంబంధించి నెల రోజుల వ్యవధిలో డబ్బింగ్ పనులు కూడా పూర్తి కావచ్చన అంటున్నారు. హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత ఉండనుందని సమాచారం.
కెరీర్ బెస్ట్ నటన
మరోవైపు ఆపరేషన్ వాలెంటైన్‌లో వరుణ్ తేజ్ నటనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వరుణ్ కెరీర్ బెస్ట్ నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. నిజమైన ఫైటర్ పైలెట్‌లా తన పాత్రలో ఒదిగిపోయాడు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచి ప్రతిభ చూపించాడు. హీరోయిన్‌గా మానుషి చిల్లర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించింది. దాదాపుగా సినిమా అంతా హీరో హీరోయిన్లే తెరపై కనిపిస్తారు. వీళ్ల జంట చూడటానికి చాలా బాగుంది. మిగిలిన పాత్రలన్నీ పరిమితంగానే కనిపిస్తాయి. వారు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించాడు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం