కీరవాణి స్వరపరిచిన RRR మూవీలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపింది. ఈ గీతానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వరించింది. నాటు నాటు పాటతో పాటు కీరవాణి ఎన్నో వీనుల విందైన పాటలను స్వరపరిచారు. వాటిలో టాప్ 10 పాటలు ఓసారి చూద్దాం.
1. ఎత్తర జెండా- RRR
RRRలోని నాటు నాటు పాటతో పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మరో పాట ఎత్తర జెండా. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను విశాల మిశ్రా, హారిక నారాయణ్ అద్భుతంగా పాడారు.
2. శివుని ఆనా- బాహుబలి
ఎవడట, ఎవడట సాంగ్ ఆధ్యాత్మికత గల ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది. ఈ పాట సాహిత్యం అలాంటిది మరి. ఈ పాటను కీరవాణి, మౌనిమ ఆలపించారు.
3.నీతో ఉంటె చాలు – బింబిసార
కొత్త డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన తెలుగు ఫాంటసీ యాక్షన్ చిత్రం ‘బింబిసార’లోని పాట ‘నీతో ఉంటె చాలు’. శాండిల్య పిసాపతి పాడిన ఈ పాట సంగీత ప్రియులను ఎంతో అలరిస్తోంది.
4. జామురాత్రి జాబిలమ్మ- క్షణక్షణం
రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన క్షణ క్షణం మూవీలోని క్లాసిక్ సాంగ్ ఇది. ఇప్పటికీ.. పాట తెలుగు పాటల్లో మెలోడి హిట్‌గా నిలిచింది. ఈ పాటను నాగూర్ బాబు, చిత్ర అద్భుతంగా పాడారు.
5. ఎక్కడో పుట్టి- స్టూడెంట్ నంబర్ 1
SS రాజమౌళి తొలి సినిమాలోని ఈ పాట సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ కాలేజీ కల్చరల్ ఇవెంట్లలో ఈ పాట మోగకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ పాటను కీరవాణి ఆలపించారు.
6. గుండు సూది.. ఛత్రపతి
‘గుండు సూది గుండు సూది.. గుచ్చుకుంటే తప్పునాది పాట కీరవాణి స్వరపరిచిన ఎవర్ గ్రీన్ రోమాంటిక్ సాంగ్. ఈ సాంగ్‌ను కీరవాణి, సునిత అద్భుతంగా పాడారు.
7. అదివో అల్లదివో.. అన్నమయ్య
అదివో అల్లదిలో పాట ఇప్పటికీ తిరుమల గిరుల్లో మార్మోగుతూనే ఉంటుంది. ఆ పాట ప్రాశస్త్యం అలాంటింది. అన్నమయ్య సినిమాకు గాను కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ స్థాయిలో అవార్డు పొందారు. ఎస్పీ బాలు ఎంతో చక్కగా ఆలపించారు.
8.అంతా రామ మయం- రామదాసు
ఈ పాట భక్త జనులను ఉర్రూతలూగించింది. ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయేలా చేసింది. ఈ గీతాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు.
9. రాలిపోయే పువ్వా నీకు.. మాతృదేవో భవ
మాతృదేవో భవ సినిమాలోని ఈ పాటను కీరవాణి ఎంతో హృద్యంగా ఆలపించారు. ఈ పాట అంటే జూ.NTRకు చాలా ఇష్టమని చెప్పారు. ఈ పాట ఆయన సమక్షంలో తప్ప మరెక్కడ పాడనని ఓ ఇంటర్వ్యూలో కీరవాణి చెప్పారు.
10. పుణ్యభూమి నా దేశం- మేజర్ చంద్రకాంత్
ఈ పాట మేజర్ చంద్రకాంత్ సినిమాలోని దేశభక్తి గీతం. ఇప్పటికీ జాతీయ పండగల వేళ.. తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతూ ఉంటుంది. ఈ పాటను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆలపించారు.