ఒకప్పుడు థియేటర్లలో సినిమా అంటే తమకు నచ్చిన జానర్‌ను మాత్రమే ప్రేక్షకులు చూసేవారు. క్రైమ్, యాక్షన్, సైంటిఫిక్, అడ్వెంచర్, హర్రర్ తదితర కంటెంట్‌తో వచ్చిన మూవీస్‌ను కేవలం జానర్ ఇష్టపడే ఆడియన్స్ వీక్షించేవారు. ఓటీటీ రాకతో ఇందులో మార్పు వచ్చింది. కంటెంట్ బాగుంటే ఏ జానర్ చిత్రాన్నైనా చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. అలాంటి ఓ సినిమాను YouSay మీకు పరిచయం చేస్తోంది. ఈ సినిమాను ఇప్పటివరకూ చూడకపోయుంటే మీరు మంచి కంటెంట్‌ను మిస్ అయినట్లే. ఇంతకీ ఆ చిత్రం ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? తదితర విశేషాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
సినిమా ఏదంటే?
బాలీవుడ్‌లో వచ్చిన ‘మస్త్ మెయిన్ రెహ్‌నే కా’ (Mast Mein Rehne Ka) మూవీ.. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వీక్షకులను ఆకట్టుకుంది. విజయ్ మౌర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. గతేడాది డిసెంబర్‌లో అమెజాన్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి మంచి వ్యూస్‌తో ఈ సినిమా ముందుకు వెళ్తోంది. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, అభిషేక్ చౌహాన్, నీనా గుప్తా, మౌనికా పన్వార్, ఫైజల్ మాలిక్ ముఖ్య పాత్రల్లో చేశారు. IMDBలో ఈ సినిమా.. 7.1 రేటింగ్ కలిగి ఉంది.
ఎందుకు చూడాలంటే?
ప్రస్తుతం ప్రతీ ఒక్కరి జీవితం ఉరుకులు పరుగుల మీద సాగిపోతోంది. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ కష్టపడుతూనే ఉన్నారు. జీవితం అంటే ఇంతేనా? ఇంకేం లేదా? అని నిత్యం ఆలోచించే వారికి ఈ సినిమా చక్కటి సమాధానంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలియజేస్తుంది. చిన్న విషయాలకే బాధపడిపోయి.. ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక తికమక పడేవారికి పరిష్కారాన్ని చూపుతుంది.
కథేంటి
ముంబయికి చెందిన వీ.ఎస్ కామత్ (జాకీ ష్రాఫ్).. రిటైర్మెంట్ జీవితాన్ని కష్టంగా గడుపుతుంటాడు. అతడి భార్య 12 ఏళ్ల క్రితమే చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా జీవిస్తుంటాడు. నిరాశ, నిస్పృహలతో సాగిపోతున్న అతడికి భర్తపోయి ఒంటరిగా జీవిస్తున్న నీనా గుప్తా పరిచయం అవుతుంది. వారి మధ్య బలమైన స్నేహం ఏర్పడుతుంది. వారిద్దరు తమ వృద్ధాప్య జీవితాన్ని ఎంత సంతోషంగా గడిపారు? ఎలాంటి కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు? వారు తమ జీవితాలను కొత్తగా ఏ కోణంలో చూడటం ప్రారంభించారు? చివరికీ ఏమైంది? అన్నది కథ.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది