ఓటీటీ రాకతో క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆసక్తికరంగా సాగే కంటెంట్‌ను చూసేందుకు ఓటీటీ లవర్స్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది గమనించిన ప్రముఖ స్ట్రీమింగ్ వేదికలు.. అటువంచి చిత్రాలను ప్రతీవారం తీసుకొస్తూ ఆడియన్స్ సర్‌ప్రైజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వీకెండ్ కూడా సరికొత్త మిస్టర్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. సీరియల్ కిల్లర్ చుట్టూ సాగే ఆ సినిమాను చూసేందుకు సినిమా లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది? ఆ మూవీ ప్రత్యేకతలేంటి? వంటి అంశాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.
ఆ సినిమా ఏదంటే?
వైభవ్ (Vaibhav), నందితాశ్వేత (Nandita Swetha) జంటగా నటించిన చిత్రం ‘రణం’ (Ranam). మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి షరీఫ్ (Director Shareef) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తొలుత ‘రణం అరమ్ థవరేల్’ (Ranam Aram Thavarel) పేరుతో తమిళంలో ఫిబ్రవరి 23న రిలీజైంది. థియేటర్లలో పాజిటివ్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఏప్రిల్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. థియేటర్‌లో విడుదలైన రెండు నెలల తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్‌లోకి వస్తోంది.
థ్రిల్లింగ్ అంశాలు ఎన్నో..
మిస్టరీ కథ.. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో రూపొందిన ‘రణం అరమ్ థవరేల్’.. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. ఇందులోని థ్రిల్లింగ్, సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ వీక్షకులను మెప్పిస్తుంది. ముఖ్యంగా వైభవ్, నందితా శ్వేత పాత్రలకు సంబంధించి వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌ను షాక్‌కు గురిచేస్తాయి. కిల్లర్‌ను పట్టుకునేందుకు పోలీసులు వేసే స్కెచ్‌లు.. వాటి నుంచి కొద్దిలో హంతకుడు తప్పించుకోవడం వంటివి ఆడియన్స్‌ను మరింత ఉత్కంఠకు లోను చేస్తాయి. మంచి మిస్టరీ థ్రిల్లర్‌ను చూడాలని భావించేవారు ఈ వీకెండ్‌లో ‘రణం’ను చూసేయవచ్చు.
కథేంటి
కథ విషయానికి వస్తే.. శివ (వైభవ్) స్కెచ్ అర్టిస్టు. అంతుచిక్కని హత్యలను ఛేదించడంలో పోలీసులకు సాయం చేస్తుంటాడు. ఓ రోజు సిటీలో ఒక డెడ్ బాడీకి సంబంధించిన మూడు పార్ట్‌లు.. వివిధ ప్లేసుల్లో లభ్యమవుతాయి. దానికి తల ఉండదు. సేమ్ అలాంటి హత్యలే మరికొన్ని నగరంలో జరుగుతాయి. పోలీసు అధికారిణి ఇందూజ (తాన్యా హోప్)తో కలిసి శివ ఈ కేసులను ఎలా పరిష్కరించాడు? పోలీసు విచారణలో తెలిసిన సంచలన నిజాలు ఏంటి? కిల్లర్ ఈ హత్యలను ఎందుకు చేస్తున్నాడు? మిస్సైన తలలు ఎవరివి? అన్నది సినిమా కథ.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది