నవంబర్ 9 న రాష్ట్రపతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ రామ్‌నాథ్‌కోవింద్ పద్మ అవార్డులను విజేతలకు అందజేశారు. ఈ జాబితాలో 7 మంది పద్మ విభూషణ్, 10 మంది పద్మ భూషణ్ 102 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. మరణానంతరం పదహారు మందికి అవార్డులు లభించాయి. అవార్డు గ్రహీతల జాబితాలో 29 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.
దివంగత నేపథ్య గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యంకు తమిళనాడు రాష్ట్రం నుంచి ఆర్ట్ విభాగంలో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. ఆయన తనయుడు ఎస్.పీ చరణ్ ఈ అవార్డును అందుకున్నాడు.
ఇక తెలుగురాష్ట్రాల నుంచి..తెలంగాణ నుంచి ఒకరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు పద్మశ్నీ అవార్డు విజేతలుగా నిలిచారు.
తెలంగాణ నుంచి ఆర్ట్ విభాగంలో కనకరాజుకి పద్మశ్రీ అందుకున్నాడు
ఆంద్రప్రదేశ్ నుంచి శ్రీరామస్వామి అన్నవరపు, నిడుమోలు సుమతి ఆర్ట్ విభాగంలో.. ఎడ్యుకేషన్ & లిటరేచర్‌లో శ్రీ ప్రకాశ్‌రావు ఆశావాది పద్మశ్రీ అందుకున్నారు.
గాయని చిత్రకు కేరళ రాష్ట్రం నుంచి ఆర్ట్ విభాంగలో పద్మభూషణ్ అవార్డులు లభించాయి.