హాట్ హాట్ గా అందాలు ఆరబోసి తెలుగు ప్రేక్షకులను ఒక్కసారిగా తన వైపు తిప్పుకుంది అందాల భామ పాయల్ రాజ్ పుత్. RX100తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ భామ. ఆ సినిమాలో ఈవిడ చేసిన సందడికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పిల్లారా అంటూ యంగ్ హీరో ఈమె కోసం పాడిన పాట ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. కార్తికేయతో చేసిన రొమాన్స్ కూడా అప్పట్లో హాట్ టాపిక్. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఆ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో పాయల్ ఆరబోసిన అందానికి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.


అయితే ఆ సినిమా తరువాత పాయల్ చేసిన సినిమాలు అంతగా రాణించలేదు. దీంతో ఓ ఐటెం సాంగ్ కూడా చేసింది ఈ భామ, అప్పటికీ లక్ కలిసి రాలేదు. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ రూపొందించిన ‘త్రీ రోజెస్’ వెబ్ సిరీస్ లో నటించి మంచి విజయం సాధించింది. ఎప్పుడూ ఫోటో షూట్లు, రీల్స్ అంటూ ఇంస్టాగ్రామ్ లో సందడి చేస్తూ ఉంటుంది పాయల్. ఆ మధ్య ఆమె చేసిన ఓ ఫోటో షూట్ కూడా చాలా వైరల్ అయ్యింది. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని, ఈ భామ చేసిన ఫోటో షూట్ పై అప్పట్లో ట్రోల్స్ వర్షం కురిసింది.
తాజాగా మరో ఫోటో షూట్ చేసింది ఈ అమ్మడు. దానికి సంబంధించిన ఓ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఎప్పటి లాగానే తన అందమైన నవ్వుతో, పొట్టి గౌనుతో ఆ ఫోటో షూట్ లో సందడి చేసింది. హాట్ హాట్ ఫోజులు ఇస్తూ డ్యాన్సులు వేసింది. ఆ పోస్టుకు ‘నా జీవితంలోని ఈ క్షణంలో, నేను కాలానికి అనుగుణంగా ముందుకు పోతున్నాను, ఏం జరిగినా నాకు సంబంధం లేదు, ఏం జరిగినా జరగనివ్వని’ అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో పాయల్ పాప పోస్టును చూసిన ఆమె అభిమానులు, నెటిజన్లు పోస్టులపై హార్ట్ సింబల్స్ వర్షం కురిపిస్తున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్