భారత్‌లోని ప్రముఖ ఆటోమెుబైల్ కంపెనీల్లో బజాజ్ (Bajaj Auto) ఒకటి. ఆ కంపెనీ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేవి పల్సర్ బైక్స్. ఇవి స్టైలిష్ లుక్‌ను కలిగి ఉండటంతో పాటు మంచి పర్ఫార్మెన్స్‌ను కూడా అందిస్తాయి. అందుకే అవి భారత మార్కెట్‌లో ఎంతో పాపులర్ అయ్యాయి. ఇటీవల బజాజ్ కంపెనీ.. కొత్తగా పల్సర్ N150 (Pulsar N150) వెహికల్‌ను లాంచ్ చేసింది. స్పోర్ట్స్ లుక్‌లో దీనిని తీసుకొచ్చింది. దసరా పండగ సీజన్ సందర్భంగా తాజాగా ఈ నయా పల్సర్ బైక్స్ తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ బైక్ ప్రత్యేకతలు, ఫీచర్లు గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
బైక్ డిజైన్
పల్సర్ N150 డిజైన్.. N160 మాదిరిగానే స్పోర్టీ లుక్‌తో ఆకట్టుకుంటోంది. సింగిల్ పాడ్ హెడ్‌ల్యాంప్‌తో కూడిన బికినీ ఫెయిరింగ్, గ్రాఫిక్స్ డిజైన్‌తో ఎక్స్టెండెడ్ ట్యాంక్, చిన్ ఫెయిరింగ్‌తో వెహికల్ సరికొత్తగా కనిపిస్తోంది.
ఇంజిన్ & మైలేజ్
పల్సర్ N150 వెహికల్‌లో 149.6cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 14 BHP పవర్, 13.5 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ఈ బైక్ లీటర్‌కు 50 కిలో మీటర్ల దూరం ప్రయాణించగలదు.
అడ్వాన్స్‌డ్ ఫీచర్లు
పలర్స్ N150 బైక్.. LED హెడ్‌లైట్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, సైడ్-స్టాండ్ కట్ ఆఫ్ సెన్సార్, సింగిల్ ఛానల్ ABS ఫీచర్లతో వస్తుంది. సింగిల్ పీస్ సీటు, న్యారో టెయిల్ సెక్షన్, సంప్రదాయ గ్రాబ్ రైల్‌తో వెహికల్ సరికొత్తగా కనిపిస్తోంది.
బ్రేక్స్ సిస్టమ్
కొత్త పల్సర్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక వైపున మోనో-షాక్‌ను అమర్చారు. బ్రేక్ సెటప్‌లో 260 mm ఫ్రంట్ డిస్క్, వెనుకవైపు 130 డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. అయితే పలర్స్ P150తో పోలిస్తే N150 బైక్ వెనుక టైర్ కొంచెం పెద్దగా ఉంటుంది.
ఆ లుక్కే ప్రామాణికం
బజాజ్ N160 నుంచి స్పోర్టియర్, మస్కులర్ లుక్‌ను కంపెనీ కొత్త బైక్‌కు ప్రామాణికంగా తీసుకుంది. అలాగే N160తో పోలిస్తే మరింత సమర్థవంతమైన ఇంజిన్‌ను కొత్త పల్సర్ కలిగి ఉంది. ఆ లక్షణమే పలర్స్ N150 స్పెషల్‌గా, యూనిక్‌గా మార్చింది.
కలర్ ఆప్షన్స్
పలర్స్ N150 బైక్.. మూడు కలర్ ఆప్షన్స్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. రేసింగ్ రెడ్, ఎబోనీ బ్లాక్, మెటాలిక్ పెరల్ వైట్ రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.
ధర ఎంతంటే?
కొత్త బజాజ్ పల్సర్ N150 బైక్ రూ.1,17,677 (ఎక్స్-షోరూమ్) ధరతో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.
Celebrities Featured Articles Movie News
Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్